ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఏ విధమైన వింత జరిగిన అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమై వైరల్ అవుతున్నాయి. ఆ క్రమంలోనే ఓ గజరాజుకు సంబంధించిన వీడియోలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. సాధారణంగా మనలో చాలా మంది ఫిట్‌నెస్ కోసం, ఆరోగ్యం కోసం యోగాసనాలు వేస్తుంటారు. అయితే ఆ ఏనుగు స్నానం చేసేందుకు వీలుగా ఉంటుందని శీర్షాసనం వేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో elephant.ofins అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయింది. దీంతో అది కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మావటి తన ఏనుగుకు వారట్ పైప్ సహయంతో స్నానం చేయిస్తుంటాడు. అయితే తన పొట్ట కింద భాగం తడవడంలేదనుకున్న ఏనుగు ఏ ఆధారం లేకుండానే శీర్షాసనం వేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమ తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 7 వేలకు పైగా లైకులు, దాదాపు 25 లక్షల వీక్షణలు లభించాయి.
ఏనుగు వేసిన శీర్షాసనం వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..