Watch: బిడ్డను కాపాడుకునేందుకు తల్లి సాహసం.. మొసలితో పోరాటం.. వీడియో వైరల్‌..

|

Apr 15, 2023 | 2:13 PM

సుశాంత నందా ఈ వీడియోను షేర్‌ చేశారు. ఏనుగులు తమ బిడ్డలను రక్షించుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తాయనేది.. ఈ వీడియో ద్వారా మనసును కదిలించింది.. అంటూ సుశాంత నంద క్యాప్షన్‌ ఇచ్చారు. వీడియో చూసిన నెటిజన్లు ప్రతిఒక్కరూ స్పందించారు.  

Watch: బిడ్డను కాపాడుకునేందుకు తల్లి సాహసం.. మొసలితో పోరాటం.. వీడియో వైరల్‌..
Elephant
Follow us on

మనిషి అయినా, జంతువు అయినా తల్లి సంరక్షణ, ఆప్యాయత మాటల్లో చెప్పలేం. ఈ వైరల్ వీడియో అమ్మ అంటే ఏంటో మరోమారు రుజువుచేస్తోంది. తల్లులు తమ బిడ్డలను రక్షించుకోవటానికి ఎంతకైనా తెగిస్తారు. ఎవరైనా తనను ఏమైనా అంటే తల్లి తట్టుకుంటుందేమో కానీ.. తన పిల్లల జోలికి వస్తే మాత్రం అంతు చూసే దాకా ఊరుకోదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో అదే చెబుతోంది. వీడియోలో తల్లి ఏనుగు తన బిడ్డను కాపాడుకోవడానికి మొసలితో పోరాడుతుంది. తల్లి ఏనుగు దాటికి భయపడిపోయిన మొసలి ప్రాణాలు కాపాడుకోటానికి పరుగులు తీసింది.

వీడియోలో ఏనుగుపిల్ల ఒకటి చిన్న నీటి మడుగులోకి దిగుతుంది. అది నీటిలో ఆడుతుండగా తల్లి ఏనుగు తన బిడ్డ పక్కన నిలబడి దానిని గమనిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా నీటి మడుగులో దాగివున్న మొసలి, పిల్ల ఏనుగును పట్టేస్తుంది. తన బిడ్డపై మొసలి దాడి చేయబోతున్న విషయాన్ని పసిగట్టిన తల్లి ఏనుగు.. మొసలిని ప్రతిఘటించింది. కాలితో తొక్కి చంపేందుకు ప్రయత్నించింది. దీంతో తోక ముడిచిన ఆ మొసలి బతుకు జీవుడా అంటూ మడుగులో నుంచి బయటకు పారిపోయింది.

సుశాంత నందా వీడియోను షేర్‌ చేశారు. ఏనుగులు తమ బిడ్డలను రక్షించుకోవడం కోసం ఎంతవరకు వెళ్తాయనేది మనసును కదిలించింది..అంటూ సుశాంత నంద క్యాప్షన్‌ ఇచ్చారు. వీడియో చూసిన నెటిజన్లు ప్రతిఒక్కరూ స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..