King Cobra: ఇదేం వింతరా అయ్యా.. తాగుబోతును కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్‌ కోబ్రా.. ఎక్కడంటే?

|

Oct 13, 2022 | 6:03 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పంగా కింగ్‌ కోబ్రాను పేర్కొంటారు. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు పోతాయి. అలాంటి విష సర్పం తనను కాటేసిందని, అయితే చిత్ర విచిత్రంగా పామే చనిపోయిందంటూ ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు.

King Cobra: ఇదేం వింతరా అయ్యా.. తాగుబోతును కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్‌ కోబ్రా.. ఎక్కడంటే?
King Cobra
Follow us on

పాములు ఎంతో ప్రమాదకరమైనవి. కొన్ని విష సర్పాలు కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు అనంత వాయువుల్లో్ కలిసి పోతాయి. అయితే ఓ సినిమాలో చూపినట్లు మనిషిని కాటు వేసిన పామే ప్రాణాలు కోల్పోయింది. ఈ చిత్ర విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పంగా కింగ్‌ కోబ్రాను పేర్కొంటారు. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు పోతాయి. అలాంటి విష సర్పం తనను కాటేసిందని, అయితే చిత్ర విచిత్రంగా పామే చనిపోయిందంటూ ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. అంతేకాదు వైద్యులకు చూపించేందుకు చనిపోయిన కింగ్‌ కోబ్రాను పాలిథిన్‌ కవర్‌లో వేసి తన వెంట తీసుకొచ్చాడు. ఈ ఘటనతో అక్కడి వైద్యులు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే ఫుల్‌గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషినగర్‌ జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగానికి వెళ్లాడు. వైద్యుల వద్దకు వెళ్లి ‘కింగ్‌ కోబ్రా తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది మృతి చెందిందని చెప్పుకొచ్చాడు.

అయితే మొదట వైద్యులు తాగుబోతు మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే తన వెంట తీసుకొచ్చిన పాలిథిన్‌ కవర్‌ను ఓపెన్‌ చేశాడో వైద్యులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ మీమ్‌ పేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో తాగిన వ్యక్తి హాస్పిటల్‌ బెడ్‌పై పడుకొని వైద్యులతో మాట్లాడటం కనిపిస్తోంది. తన పాదంపై ఉన్న పాము కాటుని చూపించి అవసరమైన వైద్యం చేయాలని వైద్యులను కోరాడు. నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నట్లు, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..