
ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ వేళ బంగ్లాదేశ్‌లో ఒక విచిత్రమైన సంఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది. పండుగ కోసం సిద్ధం చేసిన రెండు దున్నపోతులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. వాటి భారీ పరిమాణం కంటే, ప్రపంచ దేశాల అగ్రనేతలైన డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహులను అవి పోలి ఉన్నాయనే ప్రచారం జనాల్లో విపరీతమైన ఉత్సుకతను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఢాకా, నారాయణగంజ్ పరిసర ప్రాంతాల్లో ఈ జంతువులను చూడటానికి, వాటితో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడుతున్నారు.
‘ది ఇండిపెండెంట్’ కథనం ప్రకారం.. ఒక దున్నపోతుకు స్థానికులు “డొనాల్డ్ ట్రంప్” అని ముద్దుపేరు పెట్టారు. దాదాపు 700 కిలోల బరువున్న ఈ అల్బినో జాతి దున్నపోతు లేత చర్మం, తలపై ఉండే లేత రంగు వెంట్రుకలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ జుట్టు స్టైల్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్‌స్టైల్‌ను గుర్తుకు తెస్తోందని సందర్శకులు చెబుతున్నారు. దీని యజమాని జియావుద్దీన్ మృధా మాట్లాడుతూ, తన తమ్ముడు దీని రూపాన్ని గమనించి మొదట ఆ పేరు పెట్టాడని తెలిపాడు. అయితే, నిజమైన ట్రంప్ దూకుడుగా ఉంటారనే భావన ఉన్నప్పటికీ, ఈ దున్నపోతు మాత్రం చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉంటుందని స్థానికులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ పండుగ సీజన్ ముందే ఇది అమ్ముడుపోయినట్లు సమాచారం.
మరోవైపు నారాయణగంజ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేరుతో ఉన్న మరో దున్నపోతు కూడా వైరల్‌గా మారింది. సుమారు 750 కిలోల బరువున్న ఈ జంతువు ప్రవర్తన మాత్రం ట్రంప్ దున్నపోతుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇది అత్యంత దూకుడు స్వభావంతో, అనూహ్యంగా ప్రవర్తిస్తూ భయాందోళన కలిగిస్తోంది. గట్టిగా అరుస్తూ, కాపలాదారులపైకి దూకుతూ రచ్చ చేస్తోంది. ఫార్మ్ నిర్వాహకులు దీన్ని అల్లరిది అని, దీనికి కుటిలమైన తెలివి ఉందని వర్ణించడం సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని పెంచింది.
ఈద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో ఈ రెండు జంతువుల ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ప్రపంచ నాయకుల రూపాలు, ప్రవర్తనలను వీటికి ఆపాదించడం కేవలం ఒక హాస్యాస్పదమైన యాదృచ్ఛికమా లేక నిజంగానే అలా ఉన్నాయా అని నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు.
వైరల్ దృశ్యాలను ఇక్కడ చూడండి..
A buffalo in Bangladesh has gone viral ahead of Eid al-Adha after being nicknamed “Donald Trump” due to its unusual resemblance to the US President.
Weighing around 700kg, the buffalo was raised on a local farm in Narayanganj. It was fed a nutritious diet consisting of corn,… pic.twitter.com/VpdCrUFa2J
— • (@Alhamdhulillaah) May 11, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..