Indian Currency: మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!

|

Dec 13, 2021 | 8:47 PM

మన దేశంలోని కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. భద్రతా విషయాలను దృష్టిలో...

Indian Currency: మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!
Currency
Follow us on

మన దేశంలోని కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకుని నోటుపై చిన్న చిన్న గుర్తులను వేస్తుంది. ఈ ప్రక్రియ ఫేక్ కరెన్సీకి అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుందని వారు చెబుతుంటారు. మరి మీరెప్పుడైనా రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2000 నోట్లపై నల్లటి గీతలను చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.! ఆ లైన్స్‌కు అర్ధం తెలుసుకోండి..

నోట్లపై ఉండే ఈ గీతలను ‘బ్లీడ్ మార్క్స్’ అంటారు. ఈ బ్లీడ్ మార్క్స్ ప్రత్యేకంగా అంధుల కోసం తయారు చేస్తారు. ఈ లైన్స్‌ను టచ్ చేయడం ద్వారా అది ఎంత కరెన్సీ నోట్ అనేది వారికి అర్ధమవుతుంది. అందుకే రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2000 నోట్లపై వేర్వేరు రూపాల్లో ఈ లైన్స్ ఉంటాయి. ఇవి వాటి విలువను సూచిస్తాయి.

రూ. 100 నోటుపై రెండు వైపులా నాలుగు లైన్లు(|| ||) ఉంటాయి. అలాగే రూ. 200 నోటుకు రెండు వైపులా నాలుగు లైన్లు, రెండు సున్నాలు(|| o o||) ఉంటాయి. అదే సమయంలో రూ. 500 నోట్లపై ఐదు గీతలు(|| | ||), రూ.2000 నోటుపై రెండు వైపులా 7 గీతలు(| || | || |) ఉంటాయి. ఈ గీతల సహాయంతోనే అంధులకు ఆ కరెన్సీ నోటు విలువ ఎంతో అర్ధమవుతుంది.

మరోవైపు రూ. 2000 నోటు వెనుక భాగంలో మంగళయాన్ ఫోటో ముద్రించబడి ఉంటుంది. రూ.500 నోటుపై ఎర్రకోట చిత్రాన్ని ముద్రించారు. అలాగే రూ. 200 నోటు వెనుక భాగంలో సాంచి స్థూపం ఉంటుంది. ఇక రూ.100 నోటుపై ‘రాణి కి వావ్’ చిత్రం ఉంటుంది. దీనిని UNESCO 2014 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది.