Viral News: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ధర కేవలం రూ. 18 వేలు.. ఈ ధర ఎప్పటిదో తెలుసా.?

ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 సీసీ బైక్‌ ధర సుమారు రూ. 1.8 లక్షల వరకు ఉంది. ఈ బైక్‌లోని ఫీచర్లు సూపర్‌గా ఉంటాయి కాబట్టే దర ఎంతలా ఉంటుంది. ఇప్పుడు ఈ బైక్‌ ధర సుమారు రెండు లక్షల వరకు ఉంది సరే. మరి ఓ 38 ఏళ్ల క్రితం రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ ధర ఎంత ఉందో తెలుసా.? తాజాగా అప్పటి బైక్‌ ధరకు సంబంధించిన బిల్ నెట్టింట...

Viral News: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ధర కేవలం రూ. 18 వేలు.. ఈ ధర ఎప్పటిదో తెలుసా.?
Royal Enfiled
Follow us

|

Updated on: Feb 10, 2024 | 4:18 PM

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వీధిలో నుంచి ఈ బైక్‌ వెళ్తుందంటే చాలు డు.. డు అంటూ వచ్చే సౌండ్‌కు వీధి అంతా షేక్‌ అవ్వాల్సిందే. రాయలిటీకి సింబల్‌గా కనిపించే ఈ బైక్‌ను జీవితంలో ఒక్కసారైనా ఉపయోగించాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ బైక్‌ ధర మాత్రం షాక్‌ కొట్టేలా ఉంటుంది.

ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 సీసీ బైక్‌ ధర సుమారు రూ. 1.8 లక్షల వరకు ఉంది. ఈ బైక్‌లోని ఫీచర్లు సూపర్‌గా ఉంటాయి కాబట్టే దర ఎంతలా ఉంటుంది. ఇప్పుడు ఈ బైక్‌ ధర సుమారు రెండు లక్షల వరకు ఉంది సరే. మరి ఓ 38 ఏళ్ల క్రితం రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ ధర ఎంత ఉందో తెలుసా.? తాజాగా అప్పటి బైక్‌ ధరకు సంబంధించిన బిల్ నెట్టింట వైరల్ అవుతోంది. 38 ఏళ్ల క్రితం బుల్లెట్‌ బండి ధర తెలిస్తే అవాక్కావ్వాల్సిందే.

1986లో రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ ధర ఆన్‌రోడ్‌ కేవలం రూ. 18,700 మాత్రమే. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్టాండర్డ్ మోడల్ వైరల్ బిల్లును జార్ఖండ్‌లోని సందీప్ ఆటో కంపెనీ జారీ చేసింది. ప్రస్తుతం ఈ బిల్లుకు సంబంధించిన ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 36 ఏళ్లలో ఈ బైక్‌ ధర సుమారు 100 రెట్లు పెరగడం విశేషం. దీంతో ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పుడీ ధరకు బుల్లెట్‌ అందుబాటులో ఉంటేనా, ఓ రెండు కొనేసేవాళ్లమంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మార్కెట్లోకి తాజాగా కొత్త బైక్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే భారత్‌లో 650 సీసీ ఇంజన్లతో కూడిన కొత్త బుల్లెట్‌ను తీసుకురానున్నారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఈ కొత్త బైక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారత్ లో ప్రస్తుతం రాయల్ ఎన్ ఫీల్డ్ కు చెందిన 350, 500 సీసీ బైక్ లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో 600 సీసీ బైక్స్ అందుబాటులోకి రాగా, భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ బైక్ ధర కనీసం రూ. 3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్