పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం.. వణికిపోతున్న గ్రామస్తులు..ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరికలు

నగర శివారు ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం రోజురోజుకూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, పటాన్‌చెరు పరిధిలోని పోచారం గ్రామం వద్ద ఉన్న నక్కవాగులో ఓ భారీ మొసలి ప్రత్యక్షం కావడం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. వాగు నీటిలో మొసలి స్వేచ్ఛగా విహరిస్తున్న దృశ్యాలు వెలుగుచూడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నక్కవాగు వైపు వెళ్లడానికే జంకుతున్నారు.

పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం.. వణికిపోతున్న గ్రామస్తులు..ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరికలు
Nakkavagu Crocodile News

Edited By:

Updated on: May 21, 2026 | 9:11 PM

నగర శివారు పటాన్‌చెరు పరిధిలోని పోచారం గ్రామం వద్ద ప్రవహిస్తున్న నక్కవాగులో భారీ మొసలి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా వాగు నీటిలో అనుమానాస్పద కదలికలు గమనించిన కొందరు యువకులు, తమ మొబైల్ ఫోన్లలో మొసలి సంచారాన్ని స్పష్టంగా వీడియోలు చిత్రీకరించారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. గత రెండు రోజులుగా నక్కవాగు నీటిలో వింత కదలికలు కనిపిస్తున్నాయి. దీంతో నిఘా ఉంచిన కొందరు స్థానిక యువకులు వాగు ఒడ్డున పొంచి ఉన్న భారీ ఆకారపు మొసలిని గుర్తించారు. వెంటనే వారు తమ మొబైల్ ఫోన్లలో మొసలికి సంబంధించిన దృశ్యాలను వీడియోలు తీశారు. ఈ వీడియోలు ప్రస్తుతం స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా వైరల్ కావడంతో పోచారం మరియు పరిసర గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో పోచారం గ్రామ రైతులు, పశువుల కాపరులు తమ గేదెలు, మేకలను మేపడానికి, వాటికి దాహం తీర్చడానికి రోజూ నక్కవాగు పరిసర ప్రాంతాలకే తీసుకెళ్తుంటారు. ఇప్పుడు వాగులో మొసలి ఉందనే వార్త తెలియడంతో కాపరులు తమ పశువుల ప్రాణాలకు ఎసరు వస్తుందేమోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, రైతులు ఎవరూ కూడా ఒంటరిగా వాగు వైపు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వాగులో మొసలి సంచరిస్తున్న ఉదంతంపై గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ (Forest Department) అధికారులకు సమాచారం అందించారు. సమీపంలోని జలాశయాల నుండి లేదా వరద ప్రవాహాల కారణంగా ఈ మొసలి నక్కవాగులోకి ప్రవేశించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ప్రత్యేక బృందంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మొసలిని పట్టుకుని సురక్షితమైన అభయారణ్యానికి తరలిస్తామని అధికారులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అప్పటి వరకు వాగు పరిసరాల్లోకి వెళ్లేటప్పుడు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us