Viral News: ఈ జంట సరదాగా గడిపారు.. రూ. 14 లక్షలు సంపాదించారు.. అసలు విషయం తెలిస్తే షాకే!

|

Jan 11, 2022 | 5:05 PM

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలలా జరిగిన వింతలూ-విశేషాలు క్షణాల్లో మనం...

Viral News: ఈ జంట సరదాగా గడిపారు.. రూ. 14 లక్షలు సంపాదించారు.. అసలు విషయం తెలిస్తే షాకే!
Viral
Follow us on

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలలా జరిగిన వింతలూ-విశేషాలు క్షణాల్లో మనం చూడగలుగుతున్నాం. నెట్టింట ఎన్నో విషయాలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు అవి చదివిన తర్వాత.. అసలు ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యమేస్తుంది. సరిగ్గా ఇలాంటి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. ఓ జంట సరదాగా ఐలాండ్‌కు హాలిడేను ఎంజాయ్ చేయడానికి వెళ్లి ఏకంగా రూ. 14 లక్షలు సంపాదించారు. దీనికి వెనుక అసలు విషయం ఏంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు.

ప్రపంచ మీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన హ్యారీ, బెక్కా అనే కపుల్‌కు.. ‘ఓన్లీ ఫ్యాన్స్’(Only Fans) అనే యాప్ ఓ ప్రాజెక్ట్ ఇచ్చింది. అదేంటంటే వీరిద్దరూ కలిపి ఓ ఐలాండ్‌లో సరదాగా ఎంజాయ్ చేయాలి. ఏంటి.! ఇంతేనా.. అని ఆశ్చర్యపోకండి. ఇందులో ఓ షరతు ఉంది. వీరిద్దరినీ థర్డ్ ఐ(సీసీ కెమెరాలు) 24 గంటలు పర్యవేక్షిస్తుంటాయి. ఇక ఆ జంట తాము ఎంజాయ్ చేసిన బెస్ట్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సదరు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. అంతే ఇంకేముంది లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చిపడ్డాయి.

ఇది అసలే సోషల్ మీడియా యుగం. ఎక్కువ వ్యూస్, లైక్స్ వస్తే.. డబ్బు దానంతట అదే వస్తుంది. ఒక్క నెలలోనే ఈ జంట ఏకంగా 14,000 పౌండ్లు.. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 14 లక్షలు సంపాదించింది. ఈ మేరకు బెక్కా మీడియాతో పేర్కొంది. తాము ఎలా డబ్బు సంపాదించామన్న దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదని బెక్కా స్పష్టం చేసింది. తమకు వచ్చిన డబ్బు ద్వారా తాము ఇప్పుడు హైక్లాస్ లైఫ్ స్టైల్‌ను ఎంజాయ్ చేస్తున్నామని ఆమె వివరించింది.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!

 ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..