Viral Video: మనిషివా.. డైనోసర్‌వా.. 100కిపైగా బ్రతుకున్న పాములను ఏం చేశాడో చూస్తే.. గుండెలు అదిరే

|

Jul 14, 2024 | 3:24 PM

సాధారణంగా ఎయిర్‌పోర్టులలో అధికారుల కళ్లుగప్పి.. బంగారం, వెండి, వజ్రాలు, డ్రగ్స్ లాంటి వస్తువులను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుంటారు కేటుగాళ్లు. చెప్పులు, లోదుస్తులు, పొట్టభాగం, లేదా ఫ్లవర్ వాస్‌లు ఇలా బంగారాన్ని పేస్ట్‌గా మార్చి అక్రమ రవాణా చేస్తుంటారు. ఇదంతా మీకు తెలిసిందే.

Viral Video: మనిషివా.. డైనోసర్‌వా.. 100కిపైగా బ్రతుకున్న పాములను ఏం చేశాడో చూస్తే.. గుండెలు అదిరే
Viral Video
Follow us on

సాధారణంగా ఎయిర్‌పోర్టులలో అధికారుల కళ్లుగప్పి.. బంగారం, వెండి, వజ్రాలు, డ్రగ్స్ లాంటి వస్తువులను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తుంటారు కేటుగాళ్లు. చెప్పులు, లోదుస్తులు, పొట్టభాగం, లేదా ఫ్లవర్ వాస్‌లు ఇలా బంగారాన్ని పేస్ట్‌గా మార్చి అక్రమ రవాణా చేస్తుంటారు. ఇదంతా మీకు తెలిసిందే. అయితే ఇక్కడొక వ్యక్తి.. ఒక అడుగు ముందుకేసి.. ఏకంగా బ్రతికున్న పాములను స్మగ్లింగ్ చేశాడు. అక్కడున్నది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 100 పాములు. సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తూనే చాలు ఎవ్వరికైనా చచ్చేంత భయం. అలాంటిది ఈ వ్యక్తి మామూలోడు కాదు.. ఏకంగా బ్రతికున్న పాములను ప్యాంట్‌లో పెట్టి స్మగ్లింగ్ చేశాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

చైనాలోని షెన్‌జెన్ నగరంలో పాముల స్మగ్లింగ్‌కు సంబంధించిన ఓ షాకింగ్ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ దేశం నుంచి మరో దేశానికి జంతువులు, బంగారం రవాణా విరివిగా జరుగుతూ ఉంటుంది. దీంతో కస్టమ్స్ అధికారులు గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వ్యక్తి షెన్‌జెన్ నగరంలో పాముల స్మగ్లింగ్‌ చేస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి