Viral Video: బైక్ రైడర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి.. రెడ్ జాకెట్, సన్‌ గ్గాసెస్‌తో రచ్చ.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగల్(CM Bhupesh Baghel) బైక్ రైడర్ అవతారమెత్తాడు. రెడ్ జాకెట్, సన్ గ్లాసెస్, హెల్మెట్ ధరించి..

Viral Video: బైక్ రైడర్ అవతారమెత్తిన ముఖ్యమంత్రి.. రెడ్ జాకెట్, సన్‌ గ్గాసెస్‌తో రచ్చ.. వైరల్‌ అవుతున్న వీడియో..
Cm Bhupesh

Edited By:

Updated on: Mar 04, 2022 | 6:20 AM

Viral Video: చత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగల్(CM Bhupesh Baghel) బైక్ రైడర్ అవతారమెత్తాడు. రెడ్ జాకెట్, సన్ గ్లాసెస్, హెల్మెట్ ధరించి బైక్ రైడింగ్ చేసి దుమ్ము రేపారు. సీఎం బైక్ రైడింగ్‌కు సంబంధించిన వీడియోను అక్కడి సీఎంవో అధికారులు ట్విట్టర్‌లో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌ను ఎంక‌రేజ్ చేసేందుకై చ‌త్తీస్‌ఘ‌డ్ ప్రభుత్వం ఈ నెల 5, 6 తేదీల్లో నేష‌న‌ల్ సూప‌ర్‌క్రాస్ బైక్ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించ‌బోతోంది. ఈ ఈవెంట్‌ను ప్రభుత్వం ప్రమోట్ చేస్తుండగా.. ఇందుకోసం సీఎం భూపేశ్ భగల్ బైక్ రైడర్‌గా మారడం విశేషంగా మారింది.

ఇదిలాఉంటే.. చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్‌ డ్రెస్సింగ్ స్టైల్ దాదాపు సంప్రదాయబద్దంగా ఉంటుంది. ఎక్కువగా కుర్తా పైజామాలో కనిపిస్తారు. కానీ తాజాగా ఆయన నేష‌న‌ల్ సూప‌ర్‌క్రాస్ బైక్ రేసింగ్ ఈవెంట్‌‌ను ప్రమోట్ చేయడం కోసం న్యూ లుక్‌లో దర్శనమిచ్చారు. జీన్స్ టీ-షర్ట్, కూలింగ్ గ్లాస్, బైకింగ్ జాకెట్ ధరించి.. స్పోర్ట్స్ బైక్ నడిపారు. ఆయన బైక్ నడుపుతుండగా.. మరికొందరు అధికారులు కూడా ఆయనతో పాటు బైక్ రైడింగ్‌లో పాల్గొన్నారు. ఈ రైడింగ్‌కు సంబంధించిన వీడియోను చత్తీస్‌ఘడ్ సీఎంవో సోషల్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.

Also read:

Viral Video: శివలింగాన్ని ప్రతిష్టించడంలో.. ముస్లిం వ్యక్తి కిరాక్‌ ఐడియా.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Zodiac Signs: వీరు ఇతరులకు తమ రహస్యాలు అస్సలు చెప్పరు.. వారిపై నమ్మకం వచ్చేవరకు మాట్లాడరు..

Allu Arjun: నయా పాన్ ఇండియా స్టార్.. సమ్మర్ నే టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్