సాధారణంగా ఎలుకలు (Rats), పిల్లికి మధ్య జాతి వైరమున్నట్లే కుక్క (Dog), పిల్లి (Cat) కూడా బద్ధ శుత్రవులని భావిస్తారు. అయితే ఇప్పుడు చాలామంది యజమానులు ఆ రెండింటినీ ఒకేచోట పెంచుకుంటున్నారు. ఫలితంగా అవి తమ జాతి వైరాన్ని మర్చిపోయి స్నేహంగా మెలుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుక్కలు, పిల్లులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఇటీవల నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. అలా ఇప్పుడు కూడా ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో కుక్క వీపుపై ఎక్కిన పిల్లి సరదాగా స్వారీ చేయడం మనం చూడవచ్చు. అంతేకాదు మధ్యలో ఒకసారి కుక్క తోకను పట్టుకొని ఊపుతుంది కూడా. అయితే కుక్కకు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎంతో రిలాక్స్ డ్ గా ఉంటుంది.
ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ @buitengebieden అనే పేరుగల ట్విట్టర్ యూజర్ ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అంటూ ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇప్పటి వరకు 4 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అదేవిధంగా 39 వేల మంది లైకులు కొట్టారు. కాగా ఈ వీడియోను చూస్తుంటే చాలామంది విక్రమార్కుడు- బేతాళుడు కథను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అందులో విక్రమార్కుడి వీపుపై బేతాళుడు కూర్చున్నట్లే ఈ వీడియోడలో కుక్కపై పిల్లి కూర్చుంది. ఈ క్రమంలో ‘బ్యూటిఫుల్ వీడియో’, ‘వీరి స్నేహం ఇలాగే కొనసాగాలి’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Best friends.. ? pic.twitter.com/FDFmkJ3KJ8
— Buitengebieden (@buitengebieden_) January 29, 2022
Also Read:Viral Photo: ఈ ఫొటో తీయడానికి ఏడు గంటలు పట్టిందట.. ఇంతకీ ఈ ఫొటో ప్రత్యేకత ఏంటంటే..
Viral video: ఈ బుడ్డోడిని ఒలింపిక్స్ కు రెడీ చేయండి.. నెట్టింట్లో వైరలవుతోన్న చిన్నారి వీడియో..
Arya- Sayyeshaa: టైటానిక్ ఫోజులో రొమాంటిక్ కపుల్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..