Viral Video: కారులో వరుడిని చితక్కొట్టిన వధువు..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

|

Sep 10, 2021 | 4:26 PM

Viral Video: పెళ్లికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇవి వధూవరులకు మధుర క్షణాలుగా మిగిలిపోతాయి

Viral Video: కారులో వరుడిని చితక్కొట్టిన వధువు..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Bride Beating
Follow us on

Viral Video: పెళ్లికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇవి వధూవరులకు మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం మరిచిపోని విధంగా ఉంటాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అంతేకాదు ఇలాంటి వీడియోలు ఇంటర్‌నెట్‌లో తొందరగా వైరల్‌ అవుతాయి. ఈ వీడియో చేస్తే ఇలాంటి వధువులు కూడా ఉంటారా అని ఆలోచిస్తారు. పెళ్లి కాని అబ్బాయిలు ఈ వీడియో చూస్తే పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచిస్తారు.

వైరల్‌ అయిన ఈ వీడియో చూస్తే వధువు వీడ్కోలు తర్వాత జరిగినట్లుగా అనిపిస్తుంది. మొదటగా వధూవరులిద్దరు కారులో కూర్చుంటారు. ఆ తర్వాత వధువు ఒక్కసారిగా వరుడిపై విరుచుకుపడుతుంది. వరుడి మెడపై చేయివేసి నొక్కిపట్టి మరో చేయితో మూతిపై కొడుతుంది. తర్వాత బిగ్గరగా అరుస్తూ రెండు చెంపలపై వాయిస్తుంది. కోపంతో ఇష్టారీతిన ప్రవర్తిస్తుంది. అయితే వధువు ఎందుకు ఇలా చేసిందో కారణాలు మాత్రం తెలియరాలేదు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇలాంటి వధువులు కూడా ఉంటారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వధువుకు ఆ సమయంలో దెయ్యం పట్టిందా అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరికొందరు వధువు ప్రవర్తనకు కారణం వేరే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకొందరు వరుడిని చూస్తే చాలా బాధగా ఉందని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 2.5 లక్షల మంది వీక్షించారు.

Viral Video: 200 కేజీల డార్క్‌ చాక్లెట్‌ గణపతి..! అద్భుతం ఈ ప్రతిమ.. సోషల్ మీడియాలో వైరల్‌..

Underwater Wedding: అడ్వెంచర్ సెంటర్‌లో నీటిలో పెళ్లి చేసుకుని ఒక్కటైన జంట.. వీడియో వైరల్..

Udan Scheme: ఉడాన్ పథకంలో భాగంగా ఐదు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు.. ఎక్కడెక్కడ అంటే..