Viral Video: బైక్ స్టంట్‌ చేసి అమ్మాయిల ముందు హీరో అవుదామని జీరోలైన అబ్బాయిలు .. ఫన్నీ వీడియో వైరల్

రోడ్డు మీద అబ్బాయిలు.. అమ్మాయిలను చూసి బైక్ స్పీడ్ పెంచడం, వారి ముందు స్టైల్ కొట్టడం మీరు తరచుగా చూసి ఉంటారు. అలాంటిదే ఈ వీడియోలో కనిపించింది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు బైక్‌ నడుపుతూ స్టైల్‌ కొట్టారు.

Viral Video:  బైక్ స్టంట్‌ చేసి అమ్మాయిల ముందు హీరో అవుదామని జీరోలైన అబ్బాయిలు .. ఫన్నీ వీడియో వైరల్
Funny Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Sep 03, 2022 | 8:48 AM

Viral Video: రకరకాల స్టంట్‌కి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు చాలా షాకింగ్‌గా  ఉంటాయి. అంతేకాదు వాటిని చూసినప్పుడు.. అసలు ఎలా ఇలా చేస్తారు అంటూ కొంతమంది ఆశ్చర్యపోతారు కూడా. అదే సమయంలో.. కొన్ని కొన్ని విన్యాసాలు చేయడం చిన్న విషయం కాదని.. అలాంటి వ్యక్తి హీరో వంటివాడని సరదాగా కామెంట్స్ కూడా చేస్తారు.  కొని రకాల స్టంట్‌ని చేసేందుకు సాధన తప్పనిసరి. అయితే కొందరు ఈ విషయాన్నీ అర్థం చేసుకోకుండా రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలను చూస్తే .. బైక్ మీద వెళ్లే కొందరు అబ్బాయిలు తమ హీరోయిజాన్ని ప్రదర్శించాలని కోరుకుంటారు. కొన్ని సార్లు అవి రివర్స్ అయి.. ఆస్పత్రి పాలవుతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

రోడ్డు మీద అబ్బాయిలు.. అమ్మాయిలను చూసి బైక్ స్పీడ్ పెంచడం, వారి ముందు స్టైల్ కొట్టడం మీరు తరచుగా చూసి ఉంటారు. అలాంటిదే ఈ వీడియోలో కనిపించింది. అక్కడ ఇద్దరు అబ్బాయిలు బైక్‌ నడుపుతూ స్టైల్‌ కొట్టారు. కానీ మరు క్షణంలో ఏమి జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. అమ్మాయిల ముందు హీరో అవుదామని.. జీరో అయ్యాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో స్కూల్ విడిపెట్టిన అనంతరం కొంతమంది విద్యార్థులు బైక్‌పై సరదాగా వెళ్తున్నారు. అదే సమయంలో ఓ ఇద్దరు  అమ్మాయిలు ఇంటికి వెళ్తున్నారు. గర్ల్ స్టూడెంట్స్ కు ఎదురుగా బైక్ మీద  ఇద్దరు కుర్రాళ్ళు వస్తున్నారు. అయితే అమ్మాయిలను చూసిన.. బైక్ నడుపుతున్న స్టూడెంట్ తన హీరోయిజం ప్రదర్శించాలని భావించినట్లు ఉన్నాడు.. దీంతో డ్రైవ్ చేస్తూ.. సడన్ గా బైక్ ముందు చక్రాన్ని పైకి లేపాడు. అయితే అప్పుడు బైక్ నడిపే వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయాడు. కుర్రాళ్లు వేషాలు వేసే వ్యవహారంలో బ్యాలెన్స్ కోల్పోయారు. రోడ్డుమీద పడ్డారు.

ఇన్ స్టాగ్రామ్ లో videonation.teb అనే ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు.  లక్షల వ్యూస్, వందల లైక్స్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో. ‘అబ్బాయిలు ఆస్పత్రిలో జాయిన్ అవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేశారు అని ఒకరు.. అబ్బాయిలు కరెక్ట్ గా బ్యాక్ మసాజ్ ను పొందారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..