Watch Video: వీడెవడ్రా బాబు.. థార్‌లో వచ్చి గ్రోసరీస్‌ డెలివరీ.. కస్టమర్‌ రియాక్షన్ చూస్తే..

ఇప్పుడు ఏవైనా కావాలనుకుంటే జనాలు షాప్‌కు వెళ్లి తచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే అలా పది నిమిషాల్లో మనకు కావాల్సిన వస్తువులు వచ్చేస్తాయి. సాధారణంగా వీటిని తీసుకొచ్చే డెలివరీ పాట్నర్స్‌, బైక్స్‌, స్కూటీ, సైకిల్స్‌ను ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం వెరైటీగా వచ్చి బ్లింకిట్‌ ఆర్డర్‌ డెలివరీ చేశాడు. ఇంతకు అతను ఎలా వచ్చాడో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.

Watch Video: వీడెవడ్రా బాబు.. థార్‌లో వచ్చి గ్రోసరీస్‌ డెలివరీ.. కస్టమర్‌ రియాక్షన్ చూస్తే..
Viral Video

Updated on: Sep 18, 2025 | 8:20 PM

సాధారణంగా ఫుడ్‌, లేదా సరుకులు డెలివరీ చేసే డెలివరీ బాయ్స్‌ ద్విచక్రవాహనాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మనకు ఎక్కడ చూసిన వీళ్లు బైక్స్‌పైనే కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ ఒక బ్లింకిట్‌ డెలివరీ బాయ్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో లక్షల రూపాయల విలువైన మహింద్రా థార్‌ కారులో కస్టమర్ ఇంటికి వచ్చి బ్లింకిట్‌ ఆర్డర్ డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దివ్యగ్రూవ్జ్ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం. ఒక బ్లింకిట్‌కు డెలివరీ పాట్నర్ మహింద్రా థార్‌ కారులో కస్టమర్‌ ఇంటికి వచ్చి బాల్కానీలో ఉన్న కస్టమర్‌కు ఒక తాడు‌ ద్వారా సరుకులను అందించాడు. ఆ తర్వాత తిరిగి వెనక్కి వెళ్లి తన కారు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ డెలివరీ పాట్నర్‌ థార్‌ కారులో రావడం చూసిన సదురు కస్టమర్ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. అతను కార్లో వచ్చి వెళ్తున్న దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఏంటీ బ్లింకిట్‌ తమ డెలివరీ బా‌య్స్‌కి నిజంగానే కార్లల్లో వెళ్లి డెలివరీ చేసే అంత డబ్బు చెల్లిస్తుందా.. లేదా డెలివరీ భాయ్స్‌కు థార్‌ కార్లను తక్కువ ధరకు అమ్ముతున్నారా అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

వైరల్‌ వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.