రూ.8 వేల జీతం.. వంట మాత్రం యావరేజ్! బెంగళూరులో కుక్స్‌కు ఇంత డిమాండ్ ఎందుకో తెలుసా?

మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేసేవారికి, ముఖ్యంగా బెంగళూరు వంటి ఐటీ హబ్‌లో నివసించేవారికి వంటమనిషి ని ఏర్పాటు చేసుకోవడం ఒక పెద్ద సవాలు. రోజువారీ బిజీ లైఫ్‌లో వంట చేసుకోవడం కష్టమై చాలామంది కుక్స్ పై ఆధారపడుతుంటారు. అయితే, వారు చేసే వంట రుచి సాధారణంగా ఉన్నప్పటికీ, నెలకు రూ. 7,000 నుండి రూ. 8,000 వరకు ఎందుకు చెల్లిస్తున్నారనే విషయాన్ని బెంగళూరుకు చెందిన మేఘా అనే మహిళ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ఆ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రూ.8 వేల జీతం.. వంట మాత్రం యావరేజ్! బెంగళూరులో కుక్స్‌కు ఇంత డిమాండ్ ఎందుకో తెలుసా?
Bengaluru Cook Salary

Updated on: Oct 08, 2026 | 6:02 PM

బెంగళూరులోని ఐటీ ఉద్యోగిని మేఘా, నెలకు రూ. 8,000 జీతం తీసుకునే వంట మనుషులు చేసే వంట యావరేజ్‌గా ఉన్నప్పటికీ ప్రజలు వారిని ఎందుకు కొనసాగిస్తున్నారో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వివరించారు. ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మేఘా తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరులో ఇద్దరు వ్యక్తులకు రోజుకు రెండుసార్లు వంట చేయడానికి కుక్స్ నెలకు రూ. 7,000 నుండి 8,000 వరకు చార్జ్ చేస్తారు. వారానికి ఒకరోజు ఆదివారం వారికి సెలవు ఉంటుంది. వారు ఇంటికి వచ్చి చాలా వేగంగా కూరగాయలు తరిగి, రెండు వంటకాలు చేసి వెంటనే తదుపరి ఇంటికి వెళ్లిపోతారు.

వారికి ప్రెజర్ కుక్కర్ ఒక ప్రధాన ఆయుధం అని, పప్పు, బంగాళాదుంప, సోయా, చికెన్.. ఏదైనా సరే కుక్కర్‌లోనే త్వరగా కాన్నిచేస్తారని ఆమె సరదాగా పేర్కొన్నారు. మనం ప్రత్యేకంగా ఇలాగే చేయాలని చెబితే తప్ప, సాధారణంగా ఎక్కువ నూనె, మసాలాలు వాడి వంట ముగించడం వారి షార్ట్‌కట్ పద్ధతి అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వంట రుచి సాధారణంగానే ఉన్నప్పటికీ వంట మనుషులను ఎందుకు మార్చరు? లేదా స్వయంగా ఎందుకు వండుకోరు? అనే ప్రశ్నకు మేఘా ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. మేము నెలకు రూ. 8,000 ఇస్తున్నది అద్భుతమైన, అమృత లాంటి రుచి కోసం కాదు. రోజూ ఉదయం, సాయంత్రం ఏం వండాలి, ఎలా వండాలి అని ఆలోచించే మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికే ఆ డబ్బులు చెల్లిస్తున్నాం. అని ఆమె స్పష్టం చేశారు.

ఒక నెటిజన్ స్పందిస్తూ, ప్రజలు వంట చేయడం కంటే, ప్రతిరోజూ కిచెన్ నిర్ణయాలు తీసుకోకుండా ఉండే స్వేచ్ఛ కోసమే ఆ డబ్బులు ఇస్తారు అని కామెంట్ చేశారు. వంట రుచి సాధారణంగా ఉన్నప్పటికీ, స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌లలో రోజూ జంక్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడం కంటే ఇంట వండే ఆహారమే ఆరోగ్యానికి మేలని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి బెంగళూరు మెట్రో జీవితంలో రుచి కంటే సమయం, మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సంఘటన నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us