Watch: అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..! అదిరే మేకోవర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

Dec 25, 2024 | 7:16 PM

తలపై వెంట్రుకలతో తీర్చి దిద్దిన ఈ క్రిస్మస్ చెట్టును కలర్‌ఫుల్‌ లైట్లతో మరింత అందంగా అలంకరించింది. ఆ లైట్ల వెలుతురులో క్రిస్మిస్‌ ట్రీ మరింత అందంగా కనిపిస్తుంది. తాన్య షేర్ చేసిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను 40 లక్షల మందికి పైగా వీక్షించారు. 20 గంటల్లోనే లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు.

Watch: అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..! అదిరే మేకోవర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Christmas Tree Hairstyle
Follow us on

దేశం మొత్తం క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయింది. క్రిస్మస్ కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఒకరు విభిన్నమైన హెయిర్‌ స్టైల్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఆమె తన జుట్టుతో క్రిస్మస్‌ సంబరాన్ని ప్రజలకు తెలిసేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ వేదికగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జుట్టుతో తయారు చేసిన క్రిస్మస్‌ ట్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్‌ చేసిన తాన్యా సింగ్.. క్రిస్మస్ అలంకరణలలో భాగంగా తన జుట్టును క్రిస్మస్ ట్రీగా మార్చటంతో తన వీడియో ఇప్పుడు నెక్ట్స్‌ లెవల్‌కి చేరింది. ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగు మిలియన్లకు పైగా వీక్షించారు. తాన్య ఒక ఖాళీ కూల్‌డ్రింక్‌ బాటిల్‌ను ఆమె తలపై బేస్‌గా పెట్టుకోవటంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆమె క్రిస్మస్ చెట్టు ఆకారాన్ని తయారు చేయడానికి తన జుట్టును జాగ్రత్తగా చుట్టుకుంటుంది. తాన్యా సింగ్ షేర్ చేసిన వీడియోలో ఈ స్పెషల్ క్రిస్మస్ ట్రీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తాన్య రిలీజ్‌ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

పైగా తలపై వెంట్రుకలతో తీర్చి దిద్దిన ఈ క్రిస్మస్ చెట్టును వైట్ కలర్ రిబ్బన్, కలర్‌ఫుల్‌ లైట్లతో మరింత అందంగా అలంకరించింది. ఆ లైట్ల వెలుతురులో క్రిస్మిస్‌ ట్రీ మరింత అందంగా కనిపిస్తుంది. తాన్య షేర్ చేసిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను 40 లక్షల మందికి పైగా వీక్షించారు. 20 గంటల్లోనే లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

మీరు ఇలా చేస్తారని నేను ఊహించలేదు, కానీ ఇది అద్భుతంగా ఉంది’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ఇది చాలా క్యూట్‌గా ఉంది’ అని చాలా మంది వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా సృజనాత్మకంగా ఉంది’ అని మరికొందరు అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..