Viral Video: జింకకు కోపం వస్తే ఇంత భయంకరంగా ఉంటుందా ?.. వీడియో చూస్తే షాకవుతారు..

|

Jun 30, 2022 | 4:25 PM

కానీ వాటికి కూడా కోపం వస్తుంది. ఇతర జంతువులపైనే కాదు ఏకంగా మనషులపై కూడా భయంకరంగా దాడి చేస్తాయి.

Viral Video: జింకకు కోపం వస్తే ఇంత భయంకరంగా ఉంటుందా ?.. వీడియో చూస్తే షాకవుతారు..
Viral
Follow us on

సాధారణంగా జింకలు మరే జంతువుపై దాడి చేయవు. ఎప్పుడూ నిశ్శబ్దంగా కనిపిస్తూ.. చిన్న చిన్న జంతువులను చూసి కూడా భయంతో పారిపోతుంటాయి. ఇక మనుషులు కనిపించినా జింకలు పరుగులు పెట్టేస్తాయి. జింకలు పోట్లాడుకోవడం.. లేదా మరే జంతువుపైనా దాడి చేయడం అస్సలు జరగదు. కానీ వాటికి కూడా కోపం వస్తుంది. ఇతర జంతువులపైనే కాదు ఏకంగా మనషులపై కూడా భయంకరంగా దాడి చేస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

‘Naturalezaymas_’ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడిన వీడియోలో.. ఓ వేటగాడు జింకలను వేటాడేందుకు తుపాకీతో ఎదురుచూస్తున్నాడు. ఆకస్మాత్తుగా ఓ జింక పొదల చాటు నుంచి దూసుకువచ్చి వేటగాడిపై దాడి చేసింది. జింక దాడిలో అతని కన్ను పూర్తిగా దెబ్బతిన్నది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఆ వీడియోను చూసేయ్యండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.