పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! భారతీయ స్టార్టప్ వినూత్న AI గ్లాసెస్

భారతీయ యువ పారిశ్రామికవేత్తలు ఆరుష్ యాదవ్, అర్ణవ్ కుమార్‌లు ప్రారంభించిన ది సబ్‌వోకల్ కంపెనీ ఒక వినూత్నమైన AI స్మార్ట్ గ్లాసెస్‌ను తయారు చేసింది. ఈ చష్మాలు మనం ఎలాంటి శబ్దం చేయకుండా లేదా కీబోర్డ్ తాకకుండా, కేవలం పెదవుల కదలికలు, దవడ కండరాల ఆధారంగా మాటలను టెక్స్ట్‌గా మారుస్తాయి. దీని ప్రారంభ ధర 699 డాలర్లుగా నిర్ణయించారు. ఈ పరికరం ప్రత్యేకతలు, ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం..

పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! భారతీయ స్టార్టప్ వినూత్న AI గ్లాసెస్
Ai Smart Glasses

Updated on: Nov 01, 2026 | 2:58 PM

సాంకేతిక ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. అయితే, టైపింగ్ చేయాల్సిన అవసరం లేకుండా, గొంతు విప్పి మాట్లాడాల్సిన పని లేకుండా కంప్యూటర్లు లేదా స్మార్ట్‌ఫోన్‌లతో కమ్యూనికేట్ చేయగలిగితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి విప్లవాత్మక ఆలోచనతోనే భారతీయ యువ పారిశ్రామికవేత్తలు ఆరుష్ యాదవ్, అర్ణవ్ కుమార్‌లు ఒక అద్భుతమైన AI స్మార్ట్ గ్లాసెస్‌ను రూపొందించారు.

స శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ది సబ్‌వోకల్ కంపెనీ అనే ఈ స్టార్టప్ రూపొందించిన చష్మాలు, వినియోగదారుల ముఖం, దవడ వద్ద జరిగే అతిసూక్ష్మమైన కదలికలను గుర్తుపట్టి వాటిని డిజిటల్ టెక్స్ట్‌గా మారుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా ఆఫీసుల్లో లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడి టైప్ చేయడం లేదా వేగంగా కీబోర్డ్‌పై టైప్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ది సబ్‌వోకల్ కంపెనీ నాన్-కాంటాక్ట్ రేడియో-ఫ్రీక్వెన్సీ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించింది.

దీనికి ఎలాంటి శబ్దం అవసరం లేదు.. మనం మనస్సులో అనుకుంటూ పెదవులను తేలికగా కదిలిస్తే చాలు, ఈ సెన్సార్లు దవడ కండరాల కదలికలను ట్రాక్ చేస్తాయి. సూపర్ స్పీడ్‌తో పనిచేస్తాయి. నిమిషానికి 200 పదాల కంటే ఎక్కువ వేగంతో ఇది టెక్స్ట్‌ను టైప్ చేయగలదు. నో నాయిస్ ప్రాబ్లమ్ కూడా..ఎందుకంటే.. ఇది వాయిస్ మైక్రోఫోన్ ఆధారంగా పనిచేయదు కాబట్టి, చుట్టూ ఎంత ట్రాఫిక్ లేదా రద్దీగా ఉన్నా దీని పనితీరుపై ఎలాంటి ప్రభావం పడదు.

ఈ అద్భుత ఆవిష్కరణను చూసి దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలైన వై కాంబినేటర్, ఎఫోర్ క్యాపిటల్ ముందుకు వచ్చాయి. ఈ స్టార్టప్ ప్రి-సీడ్ ఫండింగ్ రౌండ్‌లో ఏకంగా 1.3 మిలియన్ డాలర్లు సుమారు రూ.12 కోట్ల నిధులను సేకరించింది. ఈ నిధులతో ఉత్పత్తిని మరింత విస్తరించాలని కో-ఫౌండర్ ఆరుష్ యాదవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

ఈ అధునాతన ఏఐ పరికరం అసలు ధర 699 డాలర్లు అంటే సుమారు రూ.58,000 కాగా, ముందస్తుగా ఆర్డర్ చేసుకునే ఎర్లీ బర్డ్ వినియోగదారుల కోసం 499 డాలర్లకే అందిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ దీని ప్రి-ఆర్డర్‌లను ప్రారంభించింది. కీబోర్డ్, మైక్రోఫోన్ సహాయం లేకుండా కేవలం సైలెంట్ కదలికలతో పనిచేసే ఈ స్మార్ట్ గ్లాసెస్, భవిష్యత్తులో మన డిజిటల్ కమ్యూనికేషన్ శైలిని పూర్తిగా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us