Viral News: మహాతల్లీ నీకో దండం.. కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే..? పాపం భర్త పరిస్థితి..!

|

Jul 31, 2024 | 4:48 PM

ఇక, ఇద్దరిని నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దిక్కుతోచని పోలీసులు.. కౌన్సెలింగ్ కోసం సంబంధిత అధికారులకు ఇద్దరినీ తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వీరి విడాకులకు కారణంగా ఏంటనే విషయం ఆరా తీయగా, చీర విషయంలో తలెత్తిన వివాదం చివరకు కోర్టుకు చేరిందని తేలిపోయింది. భర్త చీర కొనివ్వలేదనే కారణంగానే గొడవ జరిగినట్టుగా తెలియడంతో

Viral News: మహాతల్లీ నీకో దండం.. కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే..? పాపం భర్త పరిస్థితి..!
Agra Wife
Follow us on

సంతానలేమి కారణంగా భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకున్న ఘటనలు అనేకం చూస్తుంటాం. భర్తను కుర్కురే అడిగితే కొనివ్వలేదని భార్య విడాకులు అడిగిన ఘటన కూడా జరిగింది. ఇప్పుడు అలాంటిదే మరో విడాకుల కేసు వెలుగులోకి వచ్చింది. కోరిన చీర కొనివ్వలేదని భర్త నుంచి విడాకులు కోరింది ఓ ఇల్లాలు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. విషయం కోర్టుకు చేరటంతో పోలీసుల ఆధ్వరంలో ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే..

ఆగ్రాకు చెందిన ఓ జంట 2022లో వివాహం చేసుకున్నారు. ఇంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. కానీ, గత 6 నెలలుగా అనేక కారణాలతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఈ క్రమంలోనే చీర విషయంలో మొదలైన పోరు తీవ్రస్థాయికి చేరింది. అడిగిన చీర కొనివ్వలేదని భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగిపోయింది. ఇంట్లో మొదలైన గొడవ కాస్త వీధికెక్కింది. దీంతో కోపోద్రిక్తులైన భార్య నేరుగా తన భర్తపై ఫిర్యాదుకు సిద్ధపడింది. తనను మానసికంగా హింసించారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. ఆగ్రా పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు భార్యాభర్తలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం వారిద్దరినీ ఆరోపణలపై ప్రశ్నించారు. పోలీసుల ఎదుటే ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. కౌంటర్ ఛార్జ్ జోరుగా సాగింది. అసలు కారణం తెలుసుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

ఇక, ఇద్దరిని నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దిక్కుతోచని పోలీసులు.. కౌన్సెలింగ్ కోసం సంబంధిత అధికారులకు ఇద్దరినీ తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వీరి విడాకులకు కారణంగా ఏంటనే విషయం ఆరా తీయగా, చీర విషయంలో తలెత్తిన వివాదం చివరకు కోర్టుకు చేరిందని తేలిపోయింది. భర్త చీర కొనివ్వలేదనే కారణంగానే గొడవ జరిగినట్టుగా తెలియడంతో కౌన్సెలింగ్ అధికారులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఒక్క చీరతోనే ఇద్దరి మధ్య గొడవ పోలీస్ స్టేషన్ దాకా వచ్చిందని తెలిసి నోరెళ్లబెట్టారు.. ఇరువురిని కూర్చొబెట్టిన మాట్లాడే సమయంలో కూడా ఆ భార్య చీర విషయం వదల్లేదు. చివరకు ఆ ఖరీదైన చీర ఇచ్చేందుకు భర్త ప్రేమగా, నవ్వుతూ అంగీకరించాడు. చిరాకు చూపకుండా చీర ఇవ్వాల్సిందేనని భార్య షరతు పెట్టింది. ఈ షరతుకు అంగీకరించడంతో వారి విడాకుల పంచాయతీ కాస్త పండగ వాతావరణంలా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇలా చిన్నాచితకా కారణాలతో మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్న సంఘటనలు ఇటివలీ కాలంలో బాగా పెరిగిపోయాయి. పట్టువిడుపులు లేని సంబంధాలు వాటి అర్థం కోల్పోతున్నాయనే ఆరోపణలకు ఇలాంటి కేసులు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..