Viral: పోలీస్ వాహనంతో ఇన్ స్టా రీల్స్ చేసిన యువకుడు, షాకిచ్చిన పోలీసులు

లైకుల కోసమో, ఇతరుల ద్రుష్టిలో పడటం కోసమో.. కారణాలు ఏమైనా చాలామంది సోషల్ మీడియా పేరుతో విచిత్రమైన రీల్స్ చేస్తున్నారు. ఎక్కడ రీల్స్ చేయాలో, ఎక్కడ చేయకూడదో తెలుసుకుండా ఇష్టానుసారంగా రీల్స్ చేస్తూ చిక్కుల్లో పడుతోంది నేటి యూత్. తాజాగా ఓ యువకుడు ఇన్ స్టా రీల్స్ కోసం పోలీస్ వాహనాన్ని వాడేశాడు.

Viral: పోలీస్ వాహనంతో ఇన్ స్టా రీల్స్ చేసిన యువకుడు, షాకిచ్చిన పోలీసులు
Viral

Updated on: Feb 19, 2024 | 10:46 AM

లైకుల కోసమో, ఇతరుల ద్రుష్టిలో పడటం కోసమో.. కారణాలు ఏమైనా చాలామంది సోషల్ మీడియా పేరుతో విచిత్రమైన రీల్స్ చేస్తున్నారు. ఎక్కడ రీల్స్ చేయాలో, ఎక్కడ చేయకూడదో తెలుసుకుండా ఇష్టానుసారంగా రీల్స్ చేస్తూ చిక్కుల్లో పడుతోంది నేటి యూత్. తాజాగా ఓ యువకుడు ఇన్ స్టా రీల్స్ కోసం పోలీస్ వాహనాన్ని వాడేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది.  ఓ యువకుడు పోలీస్ వాహనంతో ఇన్ స్టాగ్రామ్ రీల్ వీడియో తీసి చిక్కుల్లో పడ్డాడు.

ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇందిరాపురం ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉండగా మొయిన్ ఖాన్ పోలీసు వాహనాన్ని ఉపయోగించి వీడియో తీశాడు. ఈ వీడియోలో ఆ యువకుడు వాహనం డ్రైవర్ సీటు నుంచి దిగి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే చేస్తూ రీల్స్ చేశాడు. ఫిబ్రవరి 15 న పోస్ట్ చేసిన రీల్ నిమిషాల్లో వైరల్ అయ్యింది. మరో రీల్స్ లో కూల్ డ్రింక్ తాగుతూ మహీంద్రా బొలెరో నుంచి కిందికి దిగుతున్నట్లు చూడొచ్చు. ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో బిజీగా ఉండగా ఈ యువకుడు అదే అవకాశంగా భావించి రీల్స్ చేశాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి