ఎప్పుడైతే చేతిలోకి సెల్ ఫోన్, డేటా.. అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి జనమంతా ఆన్ లైన్ లోనే మునిగి తేలుతున్నారు. చిన్నా పెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లో గడిపేస్తున్నారు. అలా 2022 చివరి దశకు వచ్చేశాం. ఇంకా కొన్ని గంటల్లోనే 2022కు వీడ్కోలు చెప్పి, కొంగొత్త ఆశలతో 2023వ సంవత్సరానికి ఆహ్వానం పలికాల్సిన తరుణం వచ్చేస్తోంది. ఇదిలా ఉండగా.. సంవత్సరం అంతా.. ఇండియాలో ఎన్నో రకాల మార్పులు జరిగాయి. అన్ని రంగాల్లో చేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఇద్దరు బాలికలు ఇండియాలో ఏం జరుగుతుందో చెబుతూ నెటిజన్లను ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు బాలికలు 2022కు క్యూట్ ఎండింగ్ ఇచ్చేలా మెస్మరైజింగ్ పెర్‌ఫార్మన్స్ ఇచ్చారు. భారత్‌లో ఇప్పుడు ఈ రెండే ట్రెండింగ్ అంటూ తేల్చేశారు.
వైరల్ అవుతున్నఈ వీడియోలో ఓ బాలిక స్టీల్ గ్లాస్‌ను మైక్రో ఫోన్‌గా పట్టుకొని మరో బాలికను భారత్‌లో ఇప్పుడు ఏం జరుగుతోందని అడుగుతుంది. వెంటనే ఆ చిన్నారి మేరే ఇండియా మే అంటూ లతా మంగేష్కర్ ఆలపించిన, పాక్ బాలిక ఆయేషా రీమిక్స్ వెర్షన్‌తో అదరగొట్టిన మేరా దిల్ యే పుకారే ఆజా సాంగ్‌కు అద్భుతమైన స్టెప్స్ వేస్తూ అలరించింది. అవునా.. సరే, ఇంకా ఏం నడుస్తున్నాయని మళ్లీ ప్రశ్నిస్తుంది మైక్ పట్టుకున్న బాలిక.. అందుకు మరో చిన్నారి ఇన్‌స్టాగ్రాంలో సూపర్ హిట్ అయిన పత్లి కమారియ మోరి పాటను పాడుతూ కిల్లర్ మూమెంట్స్‌తో అదరగొట్టింది.
ఈ వీడియోను నింగ్మర్ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా 20 లక్షలమందికి పైగా వీడియోను వీక్షించారు. బాలికల పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిపోయారు నెటిజన్లు. చిన్నారులపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తమదై క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్ అని ఓ యూజర్ రాసుకురాగా, చిన్నారి ముఖంపై చిరునవ్వు మెరిసిందని మరో యూజర్ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి