Trending Video: బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

| Edited By: Anil kumar poka

Jan 02, 2023 | 3:22 PM

సోషల్‌ మీడియాలో క్రేజ్.. యువతలో ఎంత బలంగా ఉందంటే.. ఎలాగైనా పాపులర్‌ అవ్వాలని ప్రమాదకరమైన సాహసాలు కూడా చేసేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా లైకులు, వ్యూస్ కోసం కక్కుర్తిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు....

Trending Video: బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో
Bike Stunts Video
Follow us on

సోషల్‌ మీడియాలో క్రేజ్.. యువతలో ఎంత బలంగా ఉందంటే.. ఎలాగైనా పాపులర్‌ అవ్వాలని ప్రమాదకరమైన సాహసాలు కూడా చేసేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా లైకులు, వ్యూస్ కోసం కక్కుర్తిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అవి సక్సెస్ అయితే ఓకే.. కానీ బెడిసికొడితే.. పరిస్థితి ఊహించలేం. ఈ మధ్య ఇలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు స్కూటీపై వెళ్తూ స్టంట్‌ చేయడానికి ప్రయత్నించాడు. అతను స్టంట్‌ చేస్తూ కొద్ది దూరం వెళ్లగానే స్కూటీ అదుపు తప్పి బోల్తాపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్నఈ వీడియోలో ఓ యువకుడు స్కూటీని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడు.

ఆలా వెళ్తున్న అతను ఓ స్టంట్‌ చేద్దామనపించి, స్కూటీ వెనుక చక్రాన్ని పైకి లేపి బైక్‌ నడిపించాడు. కొద్ది రూరం సక్సెస్‌ఫుల్‌గానే వెళ్లాడు. అంతే ఉన్నట్టుండి స్కూటీ అదుపు తప్పడంతో ముందుకు పడిపోయాడు. స్కూటీ మరోవైపుకి పడిపోయింది. ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో సదరు యువకుడికి గాయాలైనట్టు తెలుస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్తు రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియా క్రేజ్‌తో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.