Trending Video: టెంప్ట్ కాకుండా ఉండటం కాస్త కష్టమే.. చూస్తుంటేనే నోరూరిపోతోంది.. మీరూ ఓ లుక్కేసేయండి..

|

Dec 16, 2022 | 9:22 AM

భారతదేశంలో రుచికరమైన వంటలకు కొదవ లేదు. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, హాట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. లిస్టు చాంతాడంత ఉంటుంది. అంతే కాకుండా ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన వంటకాలకు ఫేమస్. అక్కడ లభించే...

Trending Video: టెంప్ట్ కాకుండా ఉండటం కాస్త కష్టమే.. చూస్తుంటేనే నోరూరిపోతోంది.. మీరూ ఓ లుక్కేసేయండి..
Jalebi Video Viral
Follow us on

భారతదేశంలో రుచికరమైన వంటలకు కొదవ లేదు. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, హాట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. లిస్టు చాంతాడంత ఉంటుంది. అంతే కాకుండా ఒక్కో ప్రాంతం ఒక్కో రకమైన వంటకాలకు ఫేమస్. అక్కడ లభించే పదార్థాలు, వాటి రుచి మరెక్కడా దొరకవు. అవి కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం. వీటితో పాటు స్ట్రీట్ ఫుడ్ మన దేశంలో అగ్రభాగంలో ఉన్నాయి. పానీపూరి, కట్ లెట్, సేవ్ పూరీ.. ఇలాంటి చాట్ ఐటమ్స్ కూ కొదవ లేదు. వీటిని రుచి చూసేందుకు విదేశీయులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే.. భారతీయ తీపి పదార్థాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జిలేబీ గురించి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా లాగించే జిలేబీని ఇష్టపడని వారు ఉండరు. జలేబీకి దేశ జాతీయ స్వీట్ హోదా కూడా లభించింది. జిలేబీ రుచిలో వేరే ఏ మిఠాయి కూడా రాదని భోజన ప్రియులు చెబుతుంటారు. అయితే.. ఇవి చిన్న సైజుల్లోనే లభిస్తాయి. కానీ ప్రస్తుతం ఓ జిలేబీ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకో మీకు తెలుసా..

భారతీయులు.. తమ ప్రతి ఆనందంలోనూ స్వీట్లు తినడాన్ని అలవాటుగా చేసుకున్నారు. పండుగల సమయంలోనే కాదు సరదా కోసం కూడా స్వీట్లు తింటుంటారు. ముఖ్యంగా జిలేబీ రుచి చూడని వారు ఉండరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ మిఠాయి వ్యాపారి పాన్ లో పెద్ద జిలేబీని తయారు చేయడాన్ని చూడవచ్చు. ఇందు కోసం ఓ క్లాత్ తీసుకుని, అందులో పిండి వేసి సలసలా కాగుతున్న నూనెలో జిలేబీ వేశాడు. అది వేగిన తర్వాత తీసి వేడి వేడి పాకంలో ముంచాడు. అంతే పే…ద్ద జిలేబీ రెడీ అయిపోయింది. ఈ జిలేబీ లక్నోలోని మున్షీ పులియా చౌరహా అనే దుకాణంలో తయారైంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఈట్‌విత్‌సిడ్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద జలేబీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 31 వేలకు పైగా లైక్స్, మిలియన్ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..