ఉప్పొంగిన దేశభక్తి.. జాతీయ జెండాను చూసి చిన్నారి అనందం మామూలుగా లేదుగా..

|

Sep 30, 2022 | 7:48 AM

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేశారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా..

ఉప్పొంగిన దేశభక్తి.. జాతీయ జెండాను చూసి చిన్నారి అనందం మామూలుగా లేదుగా..
Child Video
Follow us on

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేశారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో దేశ భక్తి పెరిగింది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ఒకరికొకరు సందేశాలు పంపుకోవడానికి ఈ మాధ్యమాన్ని ఉపయోగించే కాలం ఉంది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా దీని వినియోగం మారుతూ ఇప్పుడు వినోదం కోసం వాడుతున్నారు. మనం ప్రతి రోజూ చాలా రకాల వీడియోలు చూస్తుంటాం. వాటిని చూసిన తర్వాత మనం నవ్వడమే కాకుండా ఆశ్చర్యానికి లోనవుతాం. ప్రతి ఈ రోజుల్లో అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. డబ్బు లేకుండా మనిషి సంతోషంగా ఉండలేడని చెబుతుంటారు. ఆనందానికి డబ్బుకు సంబంధం లేదని కొందరు భావిస్తుంటారు. అయితే డబ్బుకు ఆనందంతో సంబంధం లేదని ఈ వీడియో నిరూపిస్తోంది. ఈ దృశ్యాలు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని చూసి ఓ బాలుడు సంతోషిస్తున్న ఈ వీడియోను చూడటమే కాకుండా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు.

రోడ్డు పక్కన ఓ చిన్నారి నిలబడి ఉండడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. రోడ్డుపై వెళ్తున్న పోలీసుల చేతుల్లోని త్రివర్ణ పతాకాలు ఉన్నాయి. వాటిని చూసిన బాలుడు సంతోషం పట్టలేక ఆనందంతో గంతులు వేయడాన్ని చూడవచ్చు. ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. వీడియోను పోస్ట్ అయిన వెంటనే క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్లిప్ ను చూస్తున్న నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆ పిల్లవాడికి ఉన్న దేశభక్తిని కొనియాడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి