
ఈరోజుల్లో రీల్స్ మేకింగ్ క్రేజ్ యువ తరానికి పెద్ద పిచ్చిగా మారింది.. ఇక్కడ కూడా ఒక యువతి అలాంటి పిచ్చిలోనే పెళ్లికూతరి గెటప్‌లోనే రిల్స్ వెంట పరుగులు పెట్టింది. తన పెళ్లి రోజున వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని స్కూటీపై హ్యాపీ రైడింగ్‌కి బయల్దేరింది. అయితే ఈ పెళ్లికూతురు హెల్మెట్ ధరించకపోవడంతో విషయం వివాదంగా మారింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. మీరు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా ఆమెకు జరిమానా విధించినట్లు పోలీసులు షేర్ చేసిన వీడియోలో చూడవచ్చు.
ఈ వీడియోను షేర్ చేస్తూ ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అదనంగా, మీరు నిబంధనలను ఉల్లంఘిస్తే, మీరు దుష్ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆమెకు జరిమానా విధించినట్లు పోలీసులు షేర్ చేసిన వీడియోలో వెల్లడించారు.
వీడియోలో వధువు తన పెళ్లి బట్టలు, ఆభరణాలను ధరించి స్కూటర్‌పై బయల్దేరింది. ఆమెపై జరిమానా విధించిన చలాన్‌ను చూపిస్తుంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి అనేక స్పందనలు వస్తున్నాయి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి