Viral Video: జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం, ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా

|

Mar 23, 2024 | 7:19 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో అటవీ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టూరిస్టులు, జంతువుల మధ్య జరిగిన ఆసక్తికర ద్రుశ్యాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ కూడా అలాంటి వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వీడియో ఒకటి నెటిజన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది.

Viral Video: జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం, ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో అటవీ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టూరిస్టులు, జంతువుల మధ్య జరిగిన ఆసక్తికర ద్రుశ్యాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ కూడా అలాంటి వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వీడియో ఒకటి నెటిజన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది.

జంగిల్ సఫారీలో సింహం, పులి, చిరుతపులి లాంటి కనిపిస్తాయని తెలుసు. ఈ విషయం టూరిస్ట్ గైడ్‌కి కూడా తెలుసు. కానీ ఎందుకో కానీ అతను మాత్రం జీపు బానెట్ పై కూర్చొని అటవీ అందాలను అస్వాదిస్తున్నాడు. జంతువులను ఫొటోలను తీస్తున్నాడు. ఇంతలోనే అడవి రాజు సింహం అతని మీదకు దూసుకొచ్చింది. ఒక్కసారి అతనికి ఏం చేయాలో అర్ధంకాక మైండ్ బ్లాంక్ అయ్యింది. కానీ తర్వాత ఫొటో గ్రాఫర్ అయిన టూరిస్ట్ తేరుకొని సమయస్ఫూర్తిని చాటుకున్నాడు. ఏమాత్రం కదలకుండా విగ్రహం మాదిరిగా నిలబడిపోయాడు. దీంతో సింహం తన దారిన వెళ్లిపోయింది. భయపెట్టించే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏమిటంటే.. జంతువులతో ఎలా వ్యవహరించాలో ఫోటోగ్రాఫర్‌కు తెలుసు. దాని కారణంగా చావు నుంచి తప్పించుకున్నాడు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం భయపడుతారు. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. 99 లక్షల మందికి పైగా నెటిజన్స్ చూశారు. ‘ఈ వ్యక్తి నిజంగా అద్భుతం.’ ‘సింహం ముందు ఇలా కూర్చోవడానికి ధైర్యం కావాలి బాబా’ అని అంటూ రియాక్ట్ అయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..