Viral Video: మండే ఎండలకు మాస్టర్ స్కెచ్.. చల్లగా, వినూత్నంగా.. భలే కారును తయారు వేశావ్ బ్రదర్!

|

Apr 03, 2024 | 5:06 PM

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. పెరుగుతున్న టెక్నాలజీ.. పదిమందికి భిన్నంగా ఏదైనా చేయాలనే ఆలోచనలు జనాలను కొత్తవాటిపై మనసు పారేలా చేస్తున్నాయి. రొటీన్ కు భిన్నంగా ఉండాలనే ఆలోచనతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఓ వ్యక్తి కారును కారులా కాకుండా గుడిసె లాంటిని కారును తయారు చేసి వావ్ అనిపించాడు.

Viral Video: మండే ఎండలకు మాస్టర్ స్కెచ్.. చల్లగా, వినూత్నంగా.. భలే కారును తయారు వేశావ్ బ్రదర్!
Hut Car
Follow us on

పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. పెరుగుతున్న టెక్నాలజీ.. పదిమందికి భిన్నంగా ఏదైనా చేయాలనే ఆలోచనలు జనాలను కొత్తవాటిపై మనసు పారేలా చేస్తున్నాయి. రొటీన్ కు భిన్నంగా ఉండాలనే ఆలోచనతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఓ వ్యక్తి కారును కారులా కాకుండా గుడిసె లాంటిని కారును తయారు చేసి వావ్ అనిపించాడు. అయితే సోషల్ మీడియా ప్రపంచంలో అనేక ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిని చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతుంటారు. ప్రస్తుతం గుడిసె కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా మీరు షాక్ అవ్వడం ఖాయం.

కొంత మంది యువకుల బృందం ఓ వెరైటీ కారును తయారు చేశారు. పెద్ద పెద్ద కార్ల డిజైన్లకు బదులు గుడిసె లాంటి కారును తయారు చేశారు. ఆ కారు ప్రధాన రహదారిపై దూసుకుపోతుండటంతో ప్రయాణికులు ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. అయితే బ్యాటరీతో నడిచే ఈ ‘హోమ్ కార్’ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సూరత్ కు చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు.

చూసేందుకు సాధారణ కారులా కనిపించినప్పటికీ రోడ్డుపై గుడిసె కదులుతున్నట్లే ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి అజయ్ దేవగన్ సినిమా ‘టార్జాన్: ది వండర్ కార్’ గుర్తుకు వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోను 1.5 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేశారు. కోట్లాది మంది వీడియోను వీక్షించారు.  ‘ఈ కారు ఉర్ఫీ జావేద్ లగ్జరీ కారులా కనిపిస్తోంది అంటూ.. టెక్నాలజీ కారు భలే ఉందంటూ మరికొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.