Trending Video: అద్దంలో తనను తాను చూసి మురిసి పోయిన గుర్రం..

|

Jul 05, 2024 | 6:09 PM

అద్దం అనగానే ఎవరికైనా ముందుగా అమ్మాయిలే గుర్తొస్తారు. అద్దానికి, అమ్మాయిలకు ఉన్న బంధం అలాంటిది మరి. ఇంట్లో రెడీ అవడానికి చాలా సేపు చూసుకుంటారు. అదే ఏదైనా ఫంక్షన్ లాంటివి ఉన్నాయంటే.. ఇక ఓ గంట సేపు అద్దాన్ని వదలరు. తమ ఫేస్ ఎలా ఉందా, ఎలా రెడీ అయ్యామా.. ఇంకా ఏమన్నా తక్కువైందా? అని చూసుకుంటూ ఉంటారు. చివరగా రెడీ అయిన తమను చూసుకుంటూ మురిసి పోతారు. మగవారిలో కూడా కొందరు అద్దాలను విడిచి పెట్టకుండా..

Trending Video: అద్దంలో తనను తాను చూసి మురిసి పోయిన గుర్రం..
Trending Video 1
Follow us on

అద్దం అనగానే ఎవరికైనా ముందుగా అమ్మాయిలే గుర్తొస్తారు. అద్దానికి, అమ్మాయిలకు ఉన్న బంధం అలాంటిది మరి. ఇంట్లో రెడీ అవడానికి చాలా సేపు చూసుకుంటారు. అదే ఏదైనా ఫంక్షన్ లాంటివి ఉన్నాయంటే.. ఇక ఓ గంట సేపు అద్దాన్ని వదలరు. తమ ఫేస్ ఎలా ఉందా, ఎలా రెడీ అయ్యామా.. ఇంకా ఏమన్నా తక్కువైందా? అని చూసుకుంటూ ఉంటారు. చివరగా రెడీ అయిన తమను చూసుకుంటూ మురిసి పోతారు. మగవారిలో కూడా కొందరు అద్దాలను విడిచి పెట్టకుండా చూస్తారు లెండి. ఇప్పుడు అద్దం గురించి ఇంత సోది ఎందుకని కదా మీ డౌట్. మనుషులే కాదండి.. జంతువుల కూడా అద్దాల్లో తమ ముఖాలు చూసుకుంటూ ఉంటాయి.

అదేంటా అని షాక్ అవుతున్నారా.. అందుకేగా మీ కోసం వెతికి వెతికి మరీ ఈ ట్రెండింగ్ వీడియో పట్టుకొచ్చాం. ఈ వీడియో చూశారంటే.. మీరు ఖచ్చితంగా నవ్వక తప్పదు. సాధారణంగా జంతువులు నీటిలో నీటిని తాగుతూ తమను తాము చూసుకుంటేనే భయ పడతాయి. వెంటనే పరుగులు పెట్టి.. ఆగమాగం చేస్తాయి. ఇప్పుడు ఇలాగే ఓ గుర్రం కూడా మొదటి సారిగా అద్దంలో తన ముఖం చూసుకుని వింతగా ప్రవర్తించింది.

ఇవి కూడా చదవండి

అద్దంలో చూసుకుంటూ మురిసి పోయిన గుర్రం..

గుర్రాలు ఉండే షెడ్డులో ఓ యజమాని గోడకు అద్దం ఉంచాడు. అయితే ఆ షెడులోకి వెళ్లిన గుర్రం.. అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. ముందు తన ముఖాన్ని చూసి కాస్త భయ పడింది. అద్దంలో ఎవరో కనిపిస్తున్నట్టు ఉంది గుర్రానికి. వెంటనే తన ముఖాన్ని పక్కకు పెట్టింది. వెంటనే మళ్లీ అందులోకి చూసుకుంది. ఇలా ముందుకు.. వెనక్కి చూస్తూ ఇందేటి అని అనుకుంటుంది. ఇలా కొన్ని సార్లు చూస్తూ తనను తాను చూసుకుంటూ.. సిగ్గు పడుతూ.. అక్కడ నుంచి వెళ్లి పోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతుంది. మీరూ చూసేయండి.