Viral Video: కాబోయే పెళ్లికూతురు సూపర్బ్‌ డ్యాన్స్‌…నెటిజన్లు ఫిదా!

| Edited By: Janardhan Veluru

Oct 21, 2021 | 3:01 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ మధుర ఘట్టం. అందుకే వీలైనంతవరకు వేడుకగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలనుకుంటారు.

Viral Video: కాబోయే పెళ్లికూతురు సూపర్బ్‌ డ్యాన్స్‌...నెటిజన్లు ఫిదా!
Bride Dance
Follow us on

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఓ మధుర ఘట్టం. అందుకే వీలైనంతవరకు వేడుకగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా తమ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటారు. ఇక పెళ్లిలో ఫొటోషూట్‌లకు ఉన్న ప్రాధాన్యా్న్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రి-వెడ్డింగ్‌ ఫొటోషూట్లంటూ చాలామంది వధూవరులు అందమైన ప్రదేశాలు, లొకేషన్ల వద్దకు వెళ్లి వినూత్నంగా ఫొటోలు దిగుతున్నారు. అయితే ఇటీవల కొన్ని వెడ్డింగ్‌ ఫొటోషూట్లపై సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. సంస్కృతి సంప్రదాయాలను పాడు చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఓ కొత్త పెళ్లి కూతురు వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

బిడియం లేకుండా డ్యా్న్స్‌!
పూర్తి వివరాలు తెలియదు కానీ…ఫొటోషూట్‌ కోసం సంప్రదాయ దుస్తులతో ముస్తాబైంది వధువు. అదేవిధంగా ఒంటినిండా ఆభరణాలు ధరించింది. ఇక ఫొటోషూట్‌లో భాగంగా ఆమె చేసిన డ్యాన్స్‌ మరో హైలెట్‌. ఎలాంటి బిడియం, మొహమాటం లేకుండా ఈ నూతన వధువు వేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ వెడ్డింగ్‌ ఫొటోషూట్ వీడియోను మీరూ ఒకసారి చూసేయండి.

Also Read:

Viral Video: మ్యారేజ్‌ హాల్‌లో పెళ్లి సందడి.. ఇంతలో పెళ్లి జంటకి చేదు అనుభవం. నెటిజెన్లకు మాత్రం నవ్వులే.. నవ్వులు..

Indian Women Cricketers: ఆటతోనే కాదు పాటతోనూ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్న భారత మహిళా క్రికెటర్స్

Viral Video: గున్న ఏనుగును రక్షించుకునేందుకు నీటి కొలనులో మొసలితో తలపడిన తల్లి ఏనుగు.. చివరకు గెలిచిందెవరో ఊహించగలరా?