Viral Video: అర్ధరాత్రి కూడా ఆటో నడుపుతున్న 55 ఏళ్ల మహిళ.. కొడుకు నిర్వాకం తెలిస్తే ఛీ అనాల్సిందే

|

Sep 05, 2024 | 8:51 PM

కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రులను చివరి దశలో చూడడానికి డబ్బుల లెక్కలు వేసుకుంటారు. వారిని అనాధల్లా వదిలేస్తారు. తాజాగా ఓ 55 ఏళ్ల మహిళ వీడియో ప్రజలను భావోద్వేగానికి గురి చేసింది. వైరల్ క్లిప్‌లో ఢిల్లీకి చెందిన ఈ మహిళ డబ్బు సంపాదించడం కోసం అర్ధరాత్రి వరకూ ఆటో నడుపుకుంటుంది. ఇలా ఆటో నడపగా వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడుపుతుంది. రాత్రి 1.30 గంటలకు ఆటో నడుపుతున్న మహిళను చూసిన కంటెంట్ క్రియేటర్ ఆశ్చర్యపోయాడు.

Viral Video: అర్ధరాత్రి కూడా ఆటో నడుపుతున్న 55 ఏళ్ల మహిళ.. కొడుకు నిర్వాకం తెలిస్తే ఛీ అనాల్సిందే
Woman Auto Driver
Image Credit source: Instagram/@aapkartekyaho
Follow us on

గిట్టిన మనిషి పుట్టక మానడు. ఇది చక్రభ్రమణం.. అయితే మరణ సమయం ఆసన్నం అయ్యే వరకూ కష్టాలు, నష్టాలూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే బతకాల్సిందే.. కొంతమంది తన వృద్ధాప్యపు జీవితాన్ని పిల్లల దగ్గర మనవలు మనవరాళ్ళతో ఆడుకుంటూ సంతోషంగా గడుపుతారు. అదే సమయంలో కొంతమంది వయసు మళ్ళిన వారు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా కష్టపడుతూ కుంటుంబాన్ని పోషించుకుంటారు. దీనికి కారణం కొంత మంది పిల్లలు తమ తల్లిదండ్రులను చివరి దశలో చూడడానికి డబ్బుల లెక్కలు వేసుకుంటారు. వారిని అనాధల్లా వదిలేస్తారు. తాజాగా ఓ 55 ఏళ్ల మహిళ వీడియో ప్రజలను భావోద్వేగానికి గురి చేసింది. వైరల్ క్లిప్‌లో ఢిల్లీకి చెందిన ఈ మహిళ డబ్బు సంపాదించడం కోసం అర్ధరాత్రి వరకూ ఆటో నడుపుకుంటుంది. ఇలా ఆటో నడపగా వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడుపుతుంది. రాత్రి 1.30 గంటలకు ఆటో నడుపుతున్న మహిళను చూసిన కంటెంట్ క్రియేటర్ ఆశ్చర్యపోయాడు. దీనిపై సదరు వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ మహిళ చెప్పిన కథ లాంటి వ్యధను విని అందరూ భావోద్వేగానికి గురయ్యారు.

సమాజంలో స్త్రీల పోరాటానికి, సంకల్పానికి ఈ మహిళ ఒక శక్తివంతమైన ఉదాహరణ. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మగౌరవం కోల్పోకూడదని.. అవసరం అయితే శ్రమ పడడానికి వెనుకంజ వేయకూడదు అని నేటి తరం యువతీయువకులకు బోధించే స్త్రీ కథ.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన కథ. భర్తను కోల్పోయిన ఈ స్త్రీ తన కొడుకును ఒంటరిగా పెంచి పోషించింది. ఇప్పుడు కొడుకు ఎదిగాడు. అయినా సరే ఇప్పటికీ డబ్బుల కోసం తల్లితో గొడవ పడతాడు. కోట్లడతాడు. దీంతో తన ఆత్మగౌరవం నిలుపుకోవడానికి ఇంటి నిర్వహణ కోసం ఈ వయసులో కూడా ఆటో రిక్షా నడుపుతోంది. ఇంటి నిర్వహణ కోసం ఓ మహిళ చేసే పోరాటానికి నిదర్శనం ఈ మహిళ..

ఇవి కూడా చదవండి

తల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న కొడుకు

తన పిల్లలు తనను గౌరవించడం లేదని బాధాకరమైన స్వరంతో చెప్పింది. కొడుకు ఏ పని చేయడు. పైగా తల్లిని డబ్బు అడుగుతాడు. డబ్బులు ఇవ్వని రోజున కొట్లాడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి ఖర్చుల కోసం ఈ వయసులో ఈ మహిళ ఢిల్లీ రోడ్లపై ఆటో నడపాల్సి వస్తోంది.

ఇక్కడ వీడియో చూడండి

 

ఇంకా ఆ మహిళా మాట్లాడుతూ తన కొడుకు ఇలా కావడనికి కారణం తన పెంపకంలోనే ఏదో లోటు ఉండి ఉండవచ్చు అని అంటోంది. కొడుకు రెండేళ్ల వయసులో భర్త చనిపోయాడు. అప్పటి నుంచి తను ఎంతో కష్టపడి కొడుకుని పెంచినట్లు గతాన్ని గుర్తు చేసుకుంది. అయితే తల్లి అనే గౌరవం తన కొడుక్కి లేదు. నిత్యం డబ్బుల కోసం తనతో గొడవపడతాడని ఆవేదన వ్యక్తం చేసింది ఆ తల్లి.

ఈ వీడియోను బ్లాగర్ ఆయుష్ గోస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో aapkartekyaho అనే ఖాతాతో షేర్ చేసారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది తల్లి లాంటి యోధురాలు ప్రపంచంలో మరొకరు లేరని వ్యాఖ్యానించారు. మరొకరు రాశారు అమ్మ కష్టం చూసి మేము సిగ్గు పడుతున్నాం.. మరి ఎప్పుడు ఆ కొడుకు సిగ్గుపడతాడు? అని తమ బాధని వ్యక్తం చేశారు. మరోకరు వ్యాఖ్యానిస్తూ.. ఒక తల్లి వంద మంది పిల్లలను పెంచగలదు.. అయితే ఆ తల్లిని వంద పిలల్లు చుసుకోలేరు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,..