ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు.. కట్ చేస్తే.. నెక్స్ట్ సీన్‌లోనే..!

ఇద్దరు స్నేహితులు సరాదాగా ఆడిన ఆటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బ్లోయర్‌తో ఆటలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్ అనే 24 ఏళ్ల యువకుడు.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు.. కట్ చేస్తే.. నెక్స్ట్ సీన్‌లోనే..!
Representative Image

Updated on: Mar 29, 2024 | 6:19 PM

ఇద్దరు స్నేహితులు సరాదాగా ఆడిన ఆటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బ్లోయర్‌తో ఆటలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్ అనే 24 ఏళ్ల యువకుడు, మార్చి 25న స్థానిక వాషింగ్ సెంటర్‌లో పని చేస్తున్న తన స్నేహితుడు మురళి వద్దకు వెళ్లాడు. సర్వీసింగ్ కోసం తన బైక్‌ను అతడికి ఇచ్చాడు. ఆ తరువాత.. బండిపై నీటిని తొలగించే హాట్ ఎయిర్ బ్లోయర్‌తో ఇద్దరూ ఆటలు ప్రారంభించారు.

మొదట మురళి ఎయిర్ బ్లోయర్‌తో యోగేశ్ ముఖంపై గాలి కొట్టాడు. ఆ తరువాత అతడి మర్మాంగంలోకి బ్లోయర్ నాజిల్‌ను చొప్పించి ఆన్ చేశాడు. దీంతో, యోగేశ్ కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయి అతడు కూలబడిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. చివరకు అతడి ఆరోగ్యం మరింతగా విషమించి మృతి చెందాడు. కాగా, నిందితుడు మురళిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us