అదృష్టమంటే ఇదే.. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత మట్టిలో దొరికిన రూ.10 కోట్ల విలువైన వజ్రం!

అమెరికాకు చెందిన ఒక వ్యక్తి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌లో 2013 నుంచి నిరంతరం వడగట్టిన అతనికి, టిక్‌టాక్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఒక అద్భుతం ఎదురైంది. మట్టి కుప్పలో నుంచి మెరుస్తున్న సుమారు 6 క్యారెట్ల పెద్ద పసుపు రంగు వజ్రం అతనికి దొరికింది. పార్క్ చరిత్రలో ఇది నాలుగో అతిపెద్ద పసుపు రంగు వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ అరుదైన వజ్రం విలువ మార్కెట్లో కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. 13 ఏళ్ల నిరంతర శ్రమ తర్వాత లభించిన ఈ ఖజానాతో ఆ వ్యక్తి ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు.

అదృష్టమంటే ఇదే.. 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత మట్టిలో దొరికిన రూ.10 కోట్ల విలువైన వజ్రం!
Arkansas Diamond

Updated on: Oct 13, 2026 | 2:50 PM

జీవితంలో అదృష్టం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. కేవలం ఒక చిన్న ప్రయత్నం లేదా సరైన సమయం మనుషుల తలరాతలను పూర్తిగా మార్చేస్తుంటుంది. అమెరికాలోని ఆర్కెన్సా రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల జాక్ పియర్డిన్ జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. దాదాపు 13 సంవత్సరాలుగా వజ్రాల కోసం మట్టిని జల్లెడ పడుతున్న ఆయనకు, ఎట్టకేలకు ఒక భారీ వజ్రం దొరికింది. దీని విలువ సుమారు రూ. 10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

2013 నుంచి అన్వేషణ..

మిస్సౌరీకి చెందిన జాక్ పియర్ఢిన్‌ మొదటిసారిగా 2013లో టూరిస్టుగా ఆర్కెన్సాలోని క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కి వెళ్లారు. ప్రపంచంలోనే సాధారణ ప్రజలు రుసుము చెల్లించి నేరుగా వజ్రాలను వెతుక్కునేందుకు అనుమతించే ఏకైక పార్క్ ఇది. ఈ పార్క్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఎంట్రీ ఫీజు చెల్లించి మట్టిని జల్లెడ పడితే, దొరికిన వజ్రాలు పూర్తిగా అన్వేషకుల సొంతమవుతాయి. 1972 నుంచి ఇప్పటివరకు ఈ పార్కులో వేలాది వజ్రాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే పియర్ఢిన్‌కు వజ్రాలు వెతికే సరదా పట్టుకుంది. ఆ తర్వాత ఆయన అక్కడే స్థిరపడి, ఏళ్ల తరబడి మట్టిని జల్లెడ పడుతూనే ఉన్నారు. గత సంవత్సరాల్లో చిన్నపాటి రాళ్లు కొన్ని దొరికినప్పటికీ, పెద్ద విజయం మాత్రం దక్కలేదు.

టిక్‌టాక్ లైవ్‌లో తళుక్కుమన్న అదృష్టం:

ఈ ఏడాది జనవరిలో జాక్ పియర్ఢిన్‌ తన స్నేహితుడితో కలిసి టిక్‌టాక్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ మట్టి బుట్టను జల్లెడ పడుతున్నారు. అంతకుముందు కురిసిన మంచు తుఫాను కారణంగా ఆ ప్రాంతమంతా తెల్లటి మంచుతో కప్పబడి ఉంది. మట్టి దిబ్బలను పరిశీలిస్తుండగా, సడెన్‌గా ఆయన కంటికి ఒక మెరుపు తగిలింది. మొదట అది సాధారణ రాయి అనుకున్నప్పటికీ, దగ్గరకు వెళ్లి పరిశీలించగా అది అరుదైన వజ్రమని తేలింది.

దాదాపు 6 క్యారెట్లకు పైగా బరువున్న ఈ పసుపు రంగు వజ్రం చూడటానికి ఒక క్యాండీ ఆకారంలో ఉంది. ఈ పార్క్ చరిత్రలో నమోదైన నాలుగో అతిపెద్ద పసుపు రంగు వజ్రం ఇదే కావడం విశేషం. నిపుణుల అంచనా ప్రకారం, దీని మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది. 13 ఏళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో జాక్ ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us