Viral Video: వామ్మో ఇదేం పాము.. నది ఒడ్డున సేదతీరుతున్న భారీ కొండచిలువ.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

| Edited By: Anil kumar poka

Nov 30, 2021 | 5:11 PM

Python Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని

Viral Video: వామ్మో ఇదేం పాము.. నది ఒడ్డున సేదతీరుతున్న భారీ కొండచిలువ.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Python Viral Video
Follow us on

Python Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ అనకొండకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పెద్ద పామును చూడవచ్చు. ఈ వీడియో చూస్తే మీరు నమ్మడం కష్టమే.. ఎందుకంటే పాము ఆకారం, పొడవు భారీగా ఉంది. ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు చూసి.. ఆశ్చర్యానికి గురవుతున్నారు. వామ్మో.. ఇలాంటి పాము అక్కడ ఏం చేస్తుంది.. అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో నది ఒడ్డున 100 అడుగుల పొడవైన పెద్ద పాము హాయిగా సేదతీరుతుంది. నిశితంగా పరిశీలిస్తే పాము పొడవు భారీగా ఉంది. ఈ కొండచిలువ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటోందనిపిస్తోంది. అయితే.. ఒడ్డున నిద్రిస్తున్న ఈ పెద్ద కొండచిలువ ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ లోనే ఇలాంటి పాములు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇంత పెద్ద పాము అసలు భూమి మీద ఉందా..? ఉంటే.. ఆ ప్రాంతం ఏమిటీ.. ఈ వీడియోను ఎవరు తీశారు అంటూ పలు ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.

వైరల్ వీడియో.. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఎవరూ ధ్రువీకరించడం లేదు. కానీ ఈ పెద్ద పామును చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పామును చూస్తే భయం వేస్తుందని.. అసలు పాము అక్కడ ఏం చేస్తుందోనంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Watch Video: డెంజరస్ యాక్సిడెంట్.. మద్యం మత్తులో దూసుకొచ్చి చంపారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Parag Agrawal: ట్విట్టర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టిన అగర్వాల్‌ ట్వీట్‌.. చిన్నవయస్కుడైన సీఈవోగా రికార్డు