ఇక నుంచి 11 అంకెలకు.. ఫోన్ నెంబర్స్..!

Trai seeks view on 11-digit Mobile Numbers, ఇక నుంచి 11 అంకెలకు.. ఫోన్ నెంబర్స్..!

ఇండియా ప్రకారం ఫోన్‌ నెంబర్‌ అంటే.. 10 అంకెలు ఉంటాయి. ఇప్పుడివి 11 నెంబర్స్ కానున్నాయా..? అంటే అవుననే అంటోంది.. టెలికాం నియంత్రణ మండలి(ట్రాయ్). సిరీస్ పెరిగేకొలదీ.. నెంబర్స్ పెంచాల్సిన ఆవశ్యకం ఏర్పడుతోంది. అలాగే.. సెల్‌ఫోన్స్ ఉపయోగించే.. వారు ఎక్కువ అయిపోతున్నారు. ఇదివరకు ల్యాండ్‌లైన్ కలెక్షన్‌కి కూడా.. 6 నెంబర్స్ ఉండేవి.. తరువాత దాన్ని 7 నెంబర్స్ చేశారు. కాగా.. ఇప్పుడు మరో నెంబర్‌ ట్రాయ్ ఫోన్‌ నెంబర్‌లో చేర్చడంపై అటు ప్రజల అభిప్రాయలను కూడా సేకరిస్తోంది. ఈ సమాచారం ప్రకారం చాలా మంది 10 నంబర్లకే ఓటు వేస్తున్నట్టు సమాచారం. కాగా.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ మెషిన్ టూ మెషిన్ కమ్యునికేషన్స్ సేవల కోసం 13 డిజిట్ నెంబర్స్‌ని వినియోగిస్తుంది. గత ఆరు నెలలుగా ఈ ప్రాసెస్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. త్వరలోనే 11 డిజిట్స్‌గల ఫోన్ నెంబర్స్ రావడం దాదాపు ఖాయమనే అనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *