రేపు జంటనగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions in Golconda and secunderabad on 15th August, రేపు జంటనగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ :  రేపటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాటి వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు గోల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇందులో భాగంగా రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట రోడ్డును మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వాహనాలు ఏయే మార్గాల్లో గోల్కొండ కోటకు చేరుకోవాలో వాటి వివరాలు సీపీ వెల్లడించారు.

* ‘ఏబీసీ’ స్టిక్కర్స్ ఉన్న వాహనాలను ఉదయం 7.30 గంటల నుంచి 11 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ రూట్‌లో అనుమతిస్తారు.
* సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏబీసీ పాస్ కల్గిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలా నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని, బాలిక భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ఫ్లై వోవర్, లంగర్‌హౌస్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి, అక్కడ నుంచి వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలలో వాహనాలను పార్కు చేయాల్సి ఉంటుంది. ‘ఏ’ కారు పాస్ కల్గిన వాళ్లు, గోల్కొండ కోట గేట్ ముందు మెయిన్ రోడ్డులో ఫతే దర్వాజ రోడ్డులో, బి పాస్ కల్గిన వాహనాలను గోల్కొండ బస్ స్టాప్ వద్ద పార్కు చేయాల్సి ఉంటుంది . ‘సీ’ కారు పాస్ ఉన్నవాళ్లు బస్‌స్టాప్ వద్ద ఉన్న పుట్‌బాల్ గ్రౌండ్ వద్ద పార్కు చేయాలి.
* డి పాస్ కల్గిన వాళ్లు షేక్‌పేట నాలా, టోలిచౌక్, సెవన్ టూంబ్స్ వైపు నుంచి బంజారా దర్వాజ నుంచి వచ్చి ప్రియదర్శిని స్కూల్‌లో వాహనాలను పార్కు చేయాలి, ‘ఈ’ కారు పాసు ఉన్న వారు సెవెన్‌టూంబ్స్, బంజార దర్వాజ నుంచి వచ్చి ఓవైసీ గ్రౌండ్, జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్‌లో పార్కు చేయాలి. ‘ఎఫ్’ కారు పాస్ కల్గిన సాధారణ ప్రజలను లంగర్‌హౌస్ ఫ్లై వోవర్ కింద నుంచి వచ్చి ఫతే దర్వాజ మీదుగా వచ్చి వాహనాలను హుడా పార్కు, షేక్‌పేట్, టోలిచౌకి నుంచి వచ్చే వాహనాలను సెవెన్ టూంబ్స్‌లో పార్కు చేయాలి, ఈ రెండు రూట్లలో ఆర్టీసి బస్సులు కూడా తిరుగుతాయి.
* వేడుకలు పూర్తయిన తరువాత ‘ఏబీసీ’ కారు పాస్‌హోల్డర్స్ మాకై దర్వాజా, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్ వైపు నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది, ‘డీ’ కారు పాస్ హోల్డర్స్ బంజారా దర్వాజ, సెవెన్ టూంబ్స్ వైపు నుంచి వెళ్లాలి. ఇ పాస్ కల్గిన వారు బడాబజార్, ఫతే దర్వాజా, సెవెన్ టూంబ్స్ నుంచి, ‘ఎఫ్’ పాస్ కలిగిన సాధారణ ప్రజలు వారి పార్కింగ్ స్థలాల నుంచి సూచించిన రూట్‌లలో బయటకు వెళ్లిపోవాలి.
* పాస్ హోల్డర్స్‌కు తమ పాసులు ఎడమ వైపు విండ్ స్క్రీన్‌కు అతికించాలని, దానితో పాసులను ఈజీగా గుర్తించేందుకు వీలుంటుందని సూచించారు. వాహనదారులందరు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ అంజనీ కుమార్ విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా సికింద్రాబాద్‌లో పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *