కమ్మటి కాఫీ..డోస్ పెరిగిందా తలనొప్పి తప్పదట

Too many cups of coffee leads to migraine

ఉదయం నిద్రలేవగానే వేడి వేడి కాఫీ పడందే పని గడవదు కొందరికీ. చక్కటి వాసనతో చిక్కటి కాఫీని రుచి చూసిన తర్వాతే..దిన చర్య మొదలు పెడతారు మరికొందరు. కాఫీకి అంతటి ప్రాముఖ్యత ఉంది. చల్లటి వాతావరణంలో వేడివేడి కాఫీని తాగితే ఆ ఫీలింగే వేరు..భలే మజాగా ఉంటుంది కాదా.. కానీ..ఇప్పుడు అదే కాఫీతో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు కొందరు సైటింస్టులు. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే..తీవ్ర తలనొప్పి తప్పదంటున్నారు.  మొతాదుకు మించి కాఫీ తాగడం వల్ల మైగ్రేన్ సమస్య అధికమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు బెత్ ఇజ్రాయెల్ డీకోన్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది మైగ్రేన్ తో భాదపడుతున్నారని వారు వెల్లడించారు. సో దీన్ని బట్టి కాఫీని కూడా రోజుకు రెండు కప్పులు మించి తాగితే ప్రమాదమేనట…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *