ప్ర‌ముఖ న‌టుడు రాళ్ల‌ప‌ల్లి క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు రాళ్లపల్లి అనారోగ్యంతో మ్యాక్స్ క్యూర్ హాస్పిట‌ల్లో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతున్నారు. 800కి పైగా సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, క‌మెడియ‌న్‌గా పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగు సినిమా రంగం మరో అరుదైన నటుడిని కోల్పోయిందనే చెప్పాలి. కాగా ఆయన రంగస్థలంపై కూడా చెరిగిపోని ముద్ర వేశారు. చిన్నతనం నుంచే నాటకాలు వేసిన రాళ్లపల్లి సుమారు 8 వేలకు పైగా నాటకాల్లో నటించారు. వీటిలో చాలా వరకు తనే స్వయంగా రాసి […]

ప్ర‌ముఖ న‌టుడు రాళ్ల‌ప‌ల్లి క‌న్నుమూత‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 17, 2019 | 9:25 PM

ప్ర‌ముఖ న‌టుడు రాళ్లపల్లి అనారోగ్యంతో మ్యాక్స్ క్యూర్ హాస్పిట‌ల్లో క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతున్నారు. 800కి పైగా సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, క‌మెడియ‌న్‌గా పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగు సినిమా రంగం మరో అరుదైన నటుడిని కోల్పోయిందనే చెప్పాలి. కాగా ఆయన రంగస్థలంపై కూడా చెరిగిపోని ముద్ర వేశారు. చిన్నతనం నుంచే నాటకాలు వేసిన రాళ్లపల్లి సుమారు 8 వేలకు పైగా నాటకాల్లో నటించారు. వీటిలో చాలా వరకు తనే స్వయంగా రాసి దర్శకత్వం వహించినవే. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. మూడు దశాబ్దాల సినీ జీవితంలో రాళ్లపల్లి దాదాపు ఆరొందలకు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎలాంటి పాత్రనైనా అత్యంత సహజంగా, అవలీలగా పోషించడం రాళ్లపల్లికే సొంతం.

రాళ్లపల్లి తూర్పు గోదావరి జిల్లా రాచపల్లిలో అక్టోబర్ 10, 1945లో జన్మించారు. ఆయనకు కన్యాశుల్కం నాటకం ఎంతో పేరు తెచ్చింది. విద్యార్థిగా ఉన్న రోజుల్లో కళాశాల పోటీల కోసం మారని సంసారం అనే నాటిక రాసి నటించారు. రెండింటికి ప్రముఖ నటి భానుమతిగారి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. నాటకాల్లో నటిస్తూనే 1973లో ‘స్త్రీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ఊరుమ్మటి బతుకులు చిత్రంతో నంది అవార్డుతో పాటు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చిల్లర దేవుళ్లు, చలిచీమలు సినిమాలతో వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేకుండా పోయింది. ఆయన జంధ్యాల, వంశీ చిత్రాల్లో తప్పనిసరిగా ఉండేవారు.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు