దంతెరాస్‌కి పసిడి జోరు..! ఈ రోజు ధరెంతంటే..?

గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. తాజాగా.. హైదరాబాద్‌లో ఈ రోజు మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి.. రూ.39,800లుగా ఉంది. అలాగే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారు ఆభరణాల ధర రూ.36,470లుగా పలుకుతోంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా.. దేశీయంగా.. బంగారు షాపు యజమానుల నుంచి డిమాండ్ మందగించడంతో.. బంగారంపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. కిలో వెండి ఏకంగా.. రూ.500 […]

దంతెరాస్‌కి పసిడి జోరు..! ఈ రోజు ధరెంతంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2019 | 9:37 AM

గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. తాజాగా.. హైదరాబాద్‌లో ఈ రోజు మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి.. రూ.39,800లుగా ఉంది. అలాగే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారు ఆభరణాల ధర రూ.36,470లుగా పలుకుతోంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా.. దేశీయంగా.. బంగారు షాపు యజమానుల నుంచి డిమాండ్ మందగించడంతో.. బంగారంపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. కిలో వెండి ఏకంగా.. రూ.500 పెరిగి రూ.48,500కు చేరింది.

కాగా.. ఈ నెల ప్రారంభంలో.. బంగారం ధరలు బాగా తగ్గాయి. అలాగే కొనసాగుతాయని అందరూ అనుకున్నా.. నెల మధ్యలో మరోసారి 40వేల బెంజ్ మార్క్‌ని దాటాయి. అలాగే.. ఇప్పుడు మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ ముందు దంతేరాస్ రాబోతుంది. ఆ రోజు చాలా మంది పసిడి ప్రియులు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అయితే.. ఈ పెరుగుతోన్న ధరలతో.. బంగారం కొనే విధంగా లేదని.. జనాలు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.