సచిన్‌కు అభిమానంతో… బీసీసీఐ ట్వీట్‌!

This Day That Year: When Sachin Tendulkar hit his first Test Century

భారత క్రికెట్‌ లెజెండ్ సచిన్‌ టెండుల్కర్‌పై బీసీసీఐ తమ అభిమానాన్ని చాటుకుంది. ఆగస్ట్‌14,1990 నాటి మైమరిపించే ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తు ట్వీట్‌ చేసింది. ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ వేదికగా భారత-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో సచిన్‌ ఏకంగా 119 పరుగులు సాధించి ఓటమి ముప్పు నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్‌తోనే సచిన్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ బిరుదు దక్కింది. ఈ ట్వీట్‌తో సచిన్‌ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సచిన​ క్రికెట్‌ ప్రయాణంలో ఈ మ్యాచ్‌ ఎంతో కీలకమైనది. తొలి టెస్ట్‌ సెంచరీ నుంచి 100 సెంచరీల వరకు ఎన్నో రికార్డులను సచిన్‌ అధిగమించిన వైనం స్పూర్తిదాయకం. టెస్ట్‌ క్రికెట్‌లో 15,921రన్స్‌తో, వన్డే క్రికెట్‌లో 18,426 రన్స్‌తో సచిన్‌ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్లతో గెలిచి సచిన్‌ వరల్డ్‌కప్‌ కలను సాకారం చేసింది. ప్రస్తుతం సచిన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా తన సేవలను అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *