Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా.. కారణాలివే..!

Maharashtra Elections 2019, ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా.. కారణాలివే..!

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు గానూ ఓటింగ్ సోమవారం పూర్తయింది. ఎన్నికలు పూర్తి కాగానే వివిధ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ.. మహారాష్ట్రలో బీజేపీ కూటమి, హర్యానాలో బీజేపీ గెలుపు ఖాయమని అన్ని ఫలితాలు ఖాయం చేశాయి. దీంతో మోదీ హవా తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహరాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి దాదాపుగా డబుల్ సెంచరీ సాధిస్తుందని.. అలాగే 90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 71సీట్లు దక్కించుకుంటుందని అన్ని పోల్స్ అంచనా వేశాయి. అలాగే కాంగ్రెస్- ఎన్సీపీ కూటమికి 70-81 స్థానాలు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి జెండా ఎగురడానికి గల కారణాలు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవేంటంటే..!

గత 20సంవత్సరాలుగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. రాష్ట్రంలోనూ అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. అయితే ఒక్క 1999లో మాత్రమే కేంద్రంలో బీజేపీ గెలవగా.. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎస్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ లెక్కన ఇప్పుడు కూడా బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తాజా పరిణామాలను చూసుకుంటే.. ఇటీవల మహారాష్ట్రలో అరే వివాదం సంచలనంగా మారింది. మెట్రో నిర్మాణం కోసం చెట్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వగా.. దీనిపై చాలా మంది ప్రజలు తమ గొంతును వినిపించారు. కానీ బీజేపీ గెలుపుపై ఇది పెద్దగా ప్రభావం చూపలేదన్నది విశ్లేషకుల మాట. అలాగే పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం ఉండగా.. బాలీవుడ్ సెలబ్రిటీలందరితో మోదీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంటే స్టార్లందరూ మోదీకి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లైంది. ఈ మీటింగ్ కూడా కూటమి గెలుపుకు ఎంతో కొంత ప్రభావం చూపిందన్నది వారి అభిప్రాయం. ఇక ముందుతో పోలీస్తే మహారాష్ట్రలోని అన్ని వర్గాల్లో బీజేపీకి ఓటర్ల శాతం పెరుగుతూ వస్తున్నారు. ఈ విషయం 2017లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ స్పష్టమైంది. ఆ ఎన్నికల్లో స్థానిక పార్టీల కంటే బీజేపీనే ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం విశేషం. అలాగే అన్ని రాష్ట్రాల మాదిరిగానే మహారాష్ట్రలోనూ ప్రజలకు సమస్యలు ఉన్నప్పటికీ.. అవేవి బీజేపీకి వ్యతిరేకంగా మారలేకపోయాయి.

ఇక ప్రధాన ప్రతిపక్షంగా బరిలోకి దిగిన కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి ప్రచారంలోనూ ఎన్డీయేకు పోటీ ఇవ్వలేకపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మరోసారి తన అపరిపక్వతను బయటపెట్టారు. ఏదో ప్రచారం చేయాలి కదా అన్న చందనా ఆయన ఎలక్షన్ క్యాంపైయిన్ జరిగింది. అలాగే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో హడావిడి చేసిన ప్రియాంక గాంధీ సైతం మహారాష్ట్ర ఎన్నికలను పెద్దగా పట్టించుకోలేదు. ఇలా ప్రతిపక్షాల బలహీన ప్రచారం కూడా బీజేపీ కూటమికి కలిసొచ్చింది. మొత్తానికి ఇవన్నీ మహారాష్ట్రలో బీజేపీ గెలుపుకు ముఖ్య కారణంగా మారాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వమే ఉండగా.. ఆ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో అంత నెగిటివ్ లేదు. ఈ క్రమంలో అక్కడ కూడా బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.