ఈ ఏడాదిలో శంషాబాద్‏లో పట్టుబడ్డ బంగారం విలువెంతో తెలిస్తే షాకవుతారు.. మొత్తం కేసులు ఎన్నంటే ?..

కరోనా సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ బంగారం క్రేజ్ ఏమాత్రం దగ్గడం లేదు. ముఖ్యంగా భారత్‏లో పసిడికి ఉన్న

ఈ ఏడాదిలో శంషాబాద్‏లో పట్టుబడ్డ బంగారం విలువెంతో తెలిస్తే షాకవుతారు.. మొత్తం కేసులు ఎన్నంటే ?..
Follow us

|

Updated on: Dec 28, 2020 | 12:32 PM

కరోనా సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ బంగారం క్రేజ్ ఏమాత్రం దగ్గడం లేదు. ముఖ్యంగా భారత్‏లో పసిడికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పల్సిన పనేలేదు. మనదేశంలో బంగారాన్ని ఉన్న క్రేజ్‏ను చాలా మంది అనేక రకాలు ఉపయోగించుకుంటున్నారు. గల్ఫ్ దేశాల్లో బంగారం తక్కువ ధరకు కొని అక్రమంగా ఇండియాకు తరలిస్తున్నారు. దేశం మొత్తంలో ఎక్కడో ఒకచోట అక్రమ బంగారం రవాణాను అధికారులు పట్టుకుంటునే ఉన్నారు. గోల్డ్ స్మగ్లర్లు ముఖ్యంగా ఎంచుకునేది ఎయిర్ పోర్టులు. కరోనా సమయంలోనూ ఈ అక్రమ రవాణా తగ్గడంలేదు.

ఈ ఏడాదిలో హైదరాబాద్‏లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్న బంగారం విలువ అక్షరాల రూ.15కోట్లు. అంటే మొత్తం 35 కేజీల అక్రమ గోల్డ్ రవాణాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 2020 సంవత్సరం మొత్తంలో అక్రమ పసిడి రవాణా కేసులు 66 నమోదయ్యాయి. గతేడాది 2019లో రూ.19 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 58.145 కేజీల గోల్డ్‏ను కస్టమ్స్ అధికారులు పట్టుకోగా.. దాదాపూ 88 కేసులు నమోదు చేశారు. గోల్డ్ స్మగ్లర్లు ముఖ్యంగా వారి దుస్తులలో, ఐరన్ బాక్సుల్లో, వాషింగ్ మిషన్లు, వాక్యూమ్ క్లీనర్లు, మిక్సర్లు, ట్రోలీ బ్యాగ్స్, జీన్స్ ప్యాంట్లో అక్రమ బంగారాన్ని దిగుమతి చేస్తున్నారు. అటు వందే భారత్ మిషన్ విమానాల్లో సైతం డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.