ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాల నిలిపివేత !

కోవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనిపై మంగళవారం ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటన విడుదల చేసింది. మూడో దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ వికటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగాల నిలిపివేత !
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 6:58 PM

కోవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనిపై మంగళవారం ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటన విడుదల చేసింది. మూడో దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ వికటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌తో ఇబ్బందులు పడుతుండటంతో మూడోదశ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా కలిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌, సౌతాఫ్రికాలో ట్రయ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ల్స్‌ జరుగుతున్నాయి. ప్రజా వినియోగానికి తుది ఆమోదం పొందడానికి అతి దగ్గరలో ఉందని భావిస్తున్న సమయంలో మూడో దశ ట్రయల్స్ లో దుస్ఫలితాలు రావడం వ్యాక్సిన్ ఆశలపై నీళ్లు చల్లింది.

అమెరికా వ్యాప్తంగా 80 నగరాల్లో వివిధ ప్రయోగ కేంద్రాల్లో 30 వేల మంది వాలంటీర్లను నమోదు చేసుకున్నాయి. వీరంతా 18 ఏళ్ల పైబడినవారే. అలాగే వివిధ సంస్కృతులు, జాతులు, భౌగోళిక ప్రాంతాలకు చెందిన వారు వీరిలో ఉన్నారు. హెచ్ఐవీ వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇందులో ఉన్నారు. కరోనా సోకే ప్రమాదం ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు.

జనవరి 2021 కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది. వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వస్తే 300 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయాలని అమెరికా ప్రభుత్వం భావంచింది. అయితే మూడో దశ ట్రయల్స్ లో దుస్ఫలితాలు రావడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నవారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

అయితే ప్రయోగ ప్రమాణిక ప్రక్రియ ప్రకారం వ్యాక్సిన్ భద్రతపై మరోసారి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..