Breaking News
  • నేడు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.
  • నేటి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక డేఅండ్‌ నైట్‌ టెస్టు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్‌ ప్రారంభం.
  • హైదరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత. ఐఎంఎస్‌లో ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు. ఐఎంఎస్‌ కుంభకోణం నేపథ్యంలో.. ఔషధాల కొనుగోళ్లకు ముందుకురాని అధికారులు. ఔషధాల కొనుగోలు బాధ్యతను.. క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలనే యోచనలో ఐఎంఎస్‌.
  • హైదరాబాద్‌లో అమిటీ యూనివర్సిటీ. విద్యాశాఖకు దరఖాస్తు చేసిన అమిటీ గ్రూపు. ఇప్పటికే దేశంలోని 10 నగరాల్లో ఉన్న అమిటీ యూనివర్సిటీలు.
  • రజినీకాంత్‌ వ్యాఖ్యలకు పళనిస్వామి కౌంటర్‌. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా.. రాజకీయాల్లో అద్భుతాలపై మాట్లాడడం సరికాదు. దేని ఆధారంగా 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని.. రజినీకాంత్‌ విశ్వసిస్తున్నారో అర్థం కావడంలేదు-పళనిస్వామి.
  • గంగానది ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రక్షాళన కోసం రూ.28,600 కోట్ల వ్యయంతో.. 305 ప్రాజెక్టులను మంజూరు చేశాం. దాదాపు 109 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది -కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.
  • 2020లో సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయం.
  • గుంటూరు: 104 సిబ్బంది మధ్య ఘర్షణ. రాడ్‌తో ఫార్మసిస్ట్‌పై దాడి చేసిన డ్రైవర్‌. ఫార్మసిస్ట్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి దగ్గర ఘటన.

బ్రేకింగ్: సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూత

Telugu Comedian Venu Madhav Passes Away, బ్రేకింగ్: సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్‌ కమేడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా  ఉంది.

సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాధవ్ జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన.. సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగో ఏట నుంచే ఆయన మిమిక్రీ చేయడం ప్రారంభించారు. లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. సినిమాలతో పాటు పలు టీవీ ప్రోగ్రాములు కూడా చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మాస్టర్, తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. హంగామా సినిమా ద్వారా వేణుమాధవ్ హీరోగా కూడా మారారు.