Telangana: కట్టుకున్నవాడిని కాదని, ప్రియుడితో వెళ్లింది. కానీ, కొన్ని రోజుల్లోనే సీన్‌ రివర్స్‌

కట్టుకున్నవాడిని కాదని, ప్రియుడితో వెళ్లింది. కానీ, కొన్ని రోజుల్లోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. దీంతో రోడ్డునపడింది ఓ యువతి.

Telangana: కట్టుకున్నవాడిని కాదని, ప్రియుడితో వెళ్లింది. కానీ, కొన్ని రోజుల్లోనే సీన్‌ రివర్స్‌
Elope With Lover

Updated on: May 07, 2022 | 7:18 AM

అమ్మాయిలు మోసపోతున్న ఉదంతాలు రోజుకోచోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా(siddipet district)లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న వాడిని కాదని ప్రియుడుతో వెళ్లింది ఓ యువతి. పెళ్లయి 4 రోజులు కాకముందే, ప్రియుడితో పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర అలజడి నెలకుంది. ఇరుగుపొరుగువారు, బంధువుల సూటిపోటి మాటలతో ఆ కుటుంబాలు తీవ్ర వేదన చెందాయి. అయితే, ఆ యువతి నమ్మి వెళ్లిన ప్రియుడు మాత్రం తీసుకెళ్లిన నాలుగు రోజులకే ముఖం చాటేశాడు. దీంతో ప్రియురాలు ఆందోళనకు దిగింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు(Chinna Kodur) మండలానికి చెందిన యువతికి నెల రోజుల క్రితం తనకు ఇష్టం లేని పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లి ఇష్టం లేని యువతి, తాను ప్రేమించిన ప్రియుడితో 4 రోజుల క్రితం వెళ్లిపోయింది. అటు ప్రియుడు కూడా ముఖం చాటేయడంతో, యువతి బతుకు రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ప్రియుడు మోసం గ్రహించిన యువతి, అతని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో వెళితే ఇలా జరిగిందని, యువతి కన్నీటి పర్యంతమైంది.

తనకు న్యాయం జరిగే వరకు ప్రియుడి ఇంటి ముందు ఆందోళన చేస్తానని అంటోంది యువతి. అయితే, ఇలా ఇంటి మందుకు రావడంతో, యువకుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Viral: శృంగారం చేసే సమయంలో ప్రియుడి కండోమ్​కు హోల్స్.. అందుకోసం మాస్టర్ స్కెచ్.. కట్ చేస్తే

Loading...
Unable to load recommendations.
Follow Us