Telangana: కొలిక్కి వస్తున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు.. త్వరలోనే వారి నియామకం?

దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్దించారు. కాని గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు...

Telangana: కొలిక్కి వస్తున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు.. త్వరలోనే వారి నియామకం?
Telangana
Follow us

|

Updated on: Aug 15, 2024 | 7:08 AM

తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవుల లొల్లి కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో కొత్త ఎమ్మెల్సీల ఎన్నికకు మార్గం సుగమమైంది. గవర్నర్‌ కోటాపై పోరాడిన బీఆర్‌ఎస్‌ క్యాండేట్లకు చివరకు మొండిచేయే మిగిలింది. మరి కోదండరాం ఎమ్మెల్సీగా ఎప్పుడు ప్రమాణం చేయబోతున్నారు? గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును అభ్యర్దించారు. కాని గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే, గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. గతేడాది దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రికమెండ్‌ చేసింది. మంత్రివర్గం సమావేశంలో ఇద్దరి పేర్లను ఫైనల్‌ చేసి.. గవర్నర్‌కు పంపారు. కాని రాజకీయ నాయకులైన వీరిని ఎమ్మెల్సీగా నియమించడం కుదరదు అంటూ గవర్నర్ తమిళిసై ఆ సిఫారసును తోసిపుచ్చారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి పార్టీ అధినేత కోదండరాం, సియాసత్ ఉర్ధూ దినపత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ ల పేర్లను కాంగ్రెస్ గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేసింది. వీటిని ఆమె ఆమోదించింది. అయితే రాజకీయ నాయకులన్న కారణంతో తమ పేర్లను తిరస్కరించిన గవర్నర్ ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ఎమ్మెల్సీగా ఎలా నియమిస్తారని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరి నియామకంలో గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్ ను విచారించిన హైకోర్టు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. దీంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ లు ఎమ్మెల్సీలయ్యే అవకాశం అప్పట్లో కోల్పోయారు.

ఇక గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారం కోర్టుకెక్కడంతో 8 నెలలుగా పెండింగ్‌లో పడిపోయింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పిటిషన్లను విచారించిన హైకోర్టు… కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిఫార్సులను అమలు చేయకుండా హోల్డ్‌లో పెట్టేసింది. కొత్తగా మళ్లీ నియామకాలను చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం ఆశలపై నీళ్లు జల్లినట్లైంది. ఐతే ప్రభుత్వం తాజాగా కోదండరాం పేరును సిఫార్సు చేయడం, దీనిపై మళ్లీ కోర్టుకు వెళతానని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. గవర్నర్ తమిళిసై మారడం.. ఇన్‌చార్జ్ గవర్నర్ కొంత కాలం ఉండటంతో ఎమ్మెల్సీ ఖాళీ స్థానాల భర్తీ అంశం ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుతం కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు స్వీకరించడంతో మళ్లీ ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ తెరపైకి వచ్చింది. లాస్ట్ క్యాబినేట్ సమావేశంలో ఖాళీ ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ కోదండరాం, అమీర్ అలీఖాన్‌ పేర్లను క్యాబినెట్ లో తీర్మానించారు. ప్రస్తుతం ఈ అంశం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా మార్గం సుగమం అవడంతో.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్ అలీఖాన్ ల నియామకం లాంఛనం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొలిక్కి వస్తున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు.. త్వరలోనే
కొలిక్కి వస్తున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు.. త్వరలోనే
ఆగస్టు నెలాఖరుకు DSC తుది కీ విడుదల..1:3 నిష్పత్తిలో మెరిట్
ఆగస్టు నెలాఖరుకు DSC తుది కీ విడుదల..1:3 నిష్పత్తిలో మెరిట్
హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఏపీ, కర్నాటకకు వెళ్తున్నాయా..?
హైదరాబాద్ నుంచి పెట్టుబడులు ఏపీ, కర్నాటకకు వెళ్తున్నాయా..?
త్వరలో కన్యారాశిలో కేతు, శుక్రుడు కలయిక.. ఈ రాశి వారికి లాభదాయకం
త్వరలో కన్యారాశిలో కేతు, శుక్రుడు కలయిక.. ఈ రాశి వారికి లాభదాయకం
ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల
ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల
దేశ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు..
దేశ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు..
Horoscope Today: డబ్బు విషయంలో ఆ రాశి వారు ఎవరికీ హామీలు ఉండొద్దు
Horoscope Today: డబ్బు విషయంలో ఆ రాశి వారు ఎవరికీ హామీలు ఉండొద్దు
వాటర్‌ గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5 వేల బడ్జెట్‌లో
వాటర్‌ గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5 వేల బడ్జెట్‌లో
సినీ పరిశ్రమలో కాంతార పూజలు..
సినీ పరిశ్రమలో కాంతార పూజలు..
భారత మార్కెట్లోకి మరో కొత్త ట్యాబ్‌.. తక్కువ ధరలో, అద్భుతమైన ఫీచర
భారత మార్కెట్లోకి మరో కొత్త ట్యాబ్‌.. తక్కువ ధరలో, అద్భుతమైన ఫీచర
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..