
Telangana: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కసాయి భార్య , ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యాడు. డెడ్ బాడీని ఎడ్ల బండిపై తీసుకెళ్లి ఆ హత్యను ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు పసిగట్టి వారిని 24 గంటల వ్యవధిలోనే అరెస్టుచేసి ఇద్దరు నిందితులను రిమాండ్ కు పంపారు.
ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం తండాలో జరిగింది. అజ్మీర చందు (30) అనేవ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తండా పక్కన ఉన్న మరో గ్రామం వద్ద ఆయన డెడ్ బాడీ లభ్యమైంది.
మొదట హత్యా..! ప్రమాదమా.. అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. హత్యని తేలడంతో ఈ హత్య ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చేసి ఉంటారని అనుమానించారు.. కానీ సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి మృతుడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు.
హత్య కేసును మిస్టరీని 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. వివాహేతర సంబంధంతోనే భార్య పావని ఆమె ప్రియుడు సంతోష్‌తో కలిసి చందును హత్య చేసినట్లు తెలిపారు. గొడ్డలితో దాడిచేసి ఆపై శ్వాస రాకుండా హత్య చేసిన నిందితులు. అనుమానం రాకుండా మృతదేహాన్ని ఎడ్ల బండిలో తరలించి రోడ్డు పక్కన పడేసారు రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విచారణలో నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి