Hyderabad News: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని మనస్తాపంతో భార్య ఆత్మహత్య..

Hyderabad News: ప్రస్తుతం చిన్న లేదు పెద్ద లేదు.. అసలు వయసు, చదువు తో సంబంధం లేదు.. చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటూ క్షణికావేశంలో..

Hyderabad News: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని మనస్తాపంతో భార్య ఆత్మహత్య..
Hyderabad News

Updated on: Dec 05, 2021 | 11:40 AM

Hyderabad News: ప్రస్తుతం చిన్న లేదు పెద్ద లేదు.. అసలు వయసు, చదువు తో సంబంధం లేదు.. చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటూ క్షణికావేశంలో తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. తాజాగా ఓ భార్య భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని.. ఏకంగా ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే..

హైదరాబాద్ లోని గోల్నాక తిరుమల నగర్ లో శ్రీనివాసులు, విజయలక్ష్మి (35) దంపతులు నివాసం ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు పిలల్లు. శ్రీనివాస్ బైక్ మీద తిరుగుతూ ఇంటింటికి వెళ్లి చీరలు, బ్లౌజ్ మెటీరియల్ అమ్ముతుంటాడు. అంతేకాదు మరోవైపు ఇంట్లో టైలరింగ్ చేస్తుంటాడు. శనివారం భార్య విజయలక్ష్మి కోసం శ్రీనివాస్ ఒక  జాకెట్ కుట్టాడు. అయితే భర్త కుట్టిన జాకెట్ నచ్చక పోవడంతో విజయలక్ష్మి భర్తతో గొడవకు దిగింది. దీంతో భర్త నీకు నేను కుట్టిన జాకెట్ నచ్చక పోతే బ్లౌజ్ కుట్లు విప్పి నచ్చినట్టు కుట్టుకో అని చెప్పాడు. భర్త ప్రవర్తన తో మనస్తాపం చెందిన విజయలక్ష్మి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్‌కి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చి బెడ్‌రూమ్ డోర్ కొట్టారు. ఎంతకు డోర్ తీయకపోవడంతో శ్రీనివాసులు వచ్చి బలవంతంగా తలుపులు తీసి చూడగా అప్పటికే  విజయలక్ష్మి మృతి చెందింది. స్థానికుల వెంటనే అంబర్ పేట పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో విజయలక్ష్మి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Also Read: నేడు గడి కోట సంస్థానానికి మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులు.. భారీ బందోబస్తు ఏర్పాటు..