Viral Video: సూట్ కేస్ లా మడత పెట్టే వ్రత పీఠం.. కార్పెంటర్​ ప్రతిభకు మంత్రి కేటీఆర్ ఫిదా

|

Aug 17, 2023 | 2:46 PM

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ చెక్క సూట్ కేసులాంటిది తీసుకొని వచ్చాడు. దానిని ఓపెన్‌ చేయగా అందులో ఒక పూజా పీఠానికి సంబంధించిన విడి భాగాలు ఉన్నాయి. వాటిని బయటకు తీసి ఒక్కొక్కటిగా వాటి స్థానాల్లో అమర్చాడు. చివరికి అది చక్కని పూజా పీఠంలా రూపుదిద్దుకుంది. ఈ  వీడియోఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశారు.

Viral Video: సూట్ కేస్ లా మడత పెట్టే వ్రత పీఠం.. కార్పెంటర్​ ప్రతిభకు మంత్రి కేటీఆర్ ఫిదా
Carpenter Viral Video
Follow us on

ప్రతిభ ఏ ఒక్కరి సొంతమూ కాదు. ఎలాంటి డిగ్రీలు, పట్టాలు లేకుండానే తమలోని క్రియేటివిటీతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంజనీర్లను మించిన ఐడియాలతో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్పెంటర్‌ సూట్‌ కేసులా మడతపెట్టే సత్యనారాయణ స్వామి వ్రత పీఠం తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం ఫిదా అయ్యారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ చెక్క సూట్ కేసులాంటిది తీసుకొని వచ్చాడు. దానిని ఓపెన్‌ చేయగా అందులో ఒక పూజా పీఠానికి సంబంధించిన విడి భాగాలు ఉన్నాయి. వాటిని బయటకు తీసి ఒక్కొక్కటిగా వాటి స్థానాల్లో అమర్చాడు. చివరికి అది చక్కని పూజా పీఠంలా రూపుదిద్దుకుంది. ఈ  వీడియోఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశారు. కాగా ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంత నైపుణ్యం ప్రదర్శించిన ఆ కార్పెంటర్ కు సాయం అందించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు.

ఇవి కూడా చదవండి

 

దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సదరు కార్పెంటర్ నైపుణ్యం అద్భుతం అని కొనియాడారు. అతనికి సాయం చేసే విషయమై పరిశీలించాలని హైదరాబాద్‌ లోని టీ–వర్క్స్ అధికారులకు సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..