ఆసుపత్రిలోకి విష నాగు.. భయాందోళనలో రోగులు.. పరుగులు పెట్టిన వైద్య సిబ్బంది!

ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులు, విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది పామును చూసి భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో విషపూరితమైన పాము సంచరిస్తుండటంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం పామును అక్కడి నుంచి తరలించారు. దీంతో ఆసుపత్రిలో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

ఆసుపత్రిలోకి విష నాగు.. భయాందోళనలో రోగులు.. పరుగులు పెట్టిన వైద్య సిబ్బంది!
Snake In Hospital

Updated on: Nov 05, 2026 | 3:20 PM

సిద్దిపేట జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రిలోకి విషపూరితమైన పాము ప్రవేశించడంతో రోగులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది.

ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులు, విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది పామును చూసి భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో విషపూరితమైన పాము సంచరిస్తుండటంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం పామును అక్కడి నుంచి తరలించారు. దీంతో ఆసుపత్రిలో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో విషపూరితమైన పాములు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు మూడుసార్లు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగులు, వైద్య సిబ్బందికి భద్రత లేకుండా పోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, రాత్రి వేళల్లో భద్రత కోసం నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని కోరారు.

ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆరోగ్య కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us