వారికి మందు మత్తుతో పాటు పైత్యం కూడా ఎక్కువైంది. దీంతో బుర్రల్లోకి ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. పెళ్లి చేసుకున్నారు. ఒకరి మెడలో ఇంకొకరు తాళి కట్టారు. అరె.. పెళ్లి చేసుకోవడం తప్పు ఎలా అవుతుందనేగా మీ ప్రశ్న. పెళ్లి చేసుకుంది ఇద్దరు మగాళ్లు. అవునండీ బాబు.. ఈ యవ్వారం ఇక్కడితో ఆగలేదు.. తాళి కట్టించుకున్న యువకుడు.. కట్టిన వ్యక్తి ఇంటికి వెళ్లాడు. కాపురానికి వచ్చానని వయ్యారాలు పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు, అక్కడి స్థానికులు నిర్ఘాంతపోయారు. తాళి కట్టిన వ్యక్తి తల్లిదండ్రులు మందలించి అతడిని పంపించారు. దీంతో ఆ యువకుడు హర్టయ్యాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. పోలీసులు కూడా ఇదేం కేసురా బాబు అనుకుంటూ.. తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేసుకున్నారు. ఆపై తనకు నష్టపరిహారంగా రూ.లక్ష ఇస్తే కానీ కంప్లైంట్ వాపసు తీసుకోనని తెగేసి చెప్పాడు. ఈ విచిత్ర ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా(Medak district) చిలప్‌చెడ్( chilapched )లో మంగళవారం వెలుగుచూసింది. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు సంగారెడ్డి జిల్లా జోగిపేట(Jogipeta)కు చెందిన 21 ఏళ్ల యువకుడు.. కాగా, రెండో వ్యక్తి చిలప్‌చెడ్ మండలం చండూర్‌కి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవరు. వీరిద్దరికీ.. కొల్చారం మండలం దుంపలకుంటలోని ఓ కల్లు కాపౌండ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ నెల 1న ఫూటుగా తాగి.. ఆ మైకంలో చండూర్ యువకుడు తాళి కట్టగా.. జోగిపేట యువకుడు కట్టించుకున్నాడు. వ్యవహారం ముదరడంతో.. గ్రామపెద్దలు రంగంలోకి దిగారు. ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. చివరకు.. చండూర్ యువకుడి కుటుంబీకులతో రూ.10వేలు ఇప్పించడంతో ఈ విచిత్ర పెళ్లికి ఎండ్ కార్డు పడింది. జోగిపేట యువకుడు కంప్లైంట్ రిటన్ తీసుకున్నట్లు చిలప్‌చెడ్ ఠాణా ఎస్ఐ మహ్మద్‌గౌస్ తెలిపారు.
Also Read: Viral Video: ఎక్కడా ప్లేస్ లేనట్టు ఈ పాము ఎక్కడ దూరిందో చూడండి…